పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రం అంబేద్కర్ సెంటర్లో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఆలూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ప్రచార కరపత్రం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు వేల్పుల సూరన్న మున్నూరుకాపు
పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ మంద రాజు మాదిగలు ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రం ఆవిష్కరించారు.అనంతరం పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ రాజుపేట 18,19 వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి మాదిగలు ఏకతాటిపై కొచ్చి మాదిగలకు విలువ నిచ్చే పార్టీలకు ఓటు వేయాలని ఎస్సీ వర్గీకరణ సాధించుకునే అంతవరకు బిజెపి పార్టీ కి మద్దతుగా ప్రచారం నిర్వహించి బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు అహర్నిశలు కృషిచేసి వారిని గెలిపించాలని ఇప్పటికే కాంగ్రెస్
బిఆర్ఎస్ పార్టీలు మాదిగల మోసం చేసి ఇప్పటివరకు మాదిగలకు ఎంపీ టికెట్లు కూడా కేటాయించని పార్టీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాయకులు,ముఖ్యర ముఖేష్ మాదిగ ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర నాయకులు,ఎమ్మెస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు బొచ్చు ప్రశాంత్ మాదిగ,బుర్ర మహిపాల్ మాదిగ,శాయంపేట ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కోకిల సమ్మయ్య మాదిగ,గోవింద సదయ్య మాదిగ,మొలుగూరి భాను మాదిగ,కోయిల రాకేష్ మాదిగ, బుర్ర బాబు,బుర్ర రాజేష్, గోవింద రాజు మాదిగ,గోవిందా సుభాష్ మాదిగ,మరియు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
