మారపల్లి సుధీర్ కుమార్ ని అధిక మెజార్టీతో గెలిపించాలి.

జడ్పిటిసి గొర్రె సాగర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోచల్లగరిగ తిర్మాలపురం గ్రామాలలో సోమవారం రోజు న వరంగల్ పార్లమెంటు సభ్యులు మారపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం జడ్పిటిసి సాగర్ మరియు మండలంలోని బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రచారం చేశారు,అలాగే ఉపాది కూలీల దగ్గరకు వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేసారు..ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆడ పెళ్లి మల్లయ్య పిఏసీఎస్ ఎస్ ఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి కర్రే అశోక్ రెడ్డి నాగరాజు డిటి రెడ్డి పిట్ట సురేష్ బాబు అల్లం రవి శంశోద్దీన్ చేరాల సదానందం ఏకు ప్రవీణ్ ఏరుకొండ రఘు పోశాల రాజు కొల్లూరి మొగిలి కంచెర్ల కుమార్ జీబు శ్రీను పెండ్లి రవి కూస ప్రశాంత్ గుండు నగేష్ నల్ల నవీన్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

BRSపార్టీ మహాభూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మలోత్ కవిత గెలిపించండి

 .ముక్యకార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు పిలుపునించిన పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు

భద్రాచలం నేటి ధాత్రి

దుమ్ముగూడెం. సోమవారం ఈరోజు మండలంలోని మరాయిగూడెం లో 6 బూతులు,తురుబాకలో 5 బూతులు కొత్తూరులో 2, బూతుల కమిటీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ అబద్ధపు అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీలను అమలు చేయలేక గతప్రభుత్వం పై బురద చల్లుతున్నదని గతంలో KCR చేసిన అభివృద్ధిని తెలంగాణా లో ఏ గ్రామంలోకి వెళ్లిన కనిపిస్తుంది అని 60 ఏండ్లుగా గ్రామాలు మంచినీళ్లు లేక అల్లాడేవని కరెంట్ కష్టాలు ఉండేవని కానీ పోరాడితెచ్చుకున్న తెలంగాణలో కరెంట్ కష్టాలు లేకుండా మంచినీటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ కంటికి రెప్పలా కాపాడుకున్నారని అదే అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం లో మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ను ఏవిధాగా అయితే వివక్షతకు గురిచేసిందో అదే పద్దతిలో తెలంగాణ ఢిల్లీ గులాములకు తాకట్టు పెట్టిందని గతంలో కేంద్రమంత్రిగా ఉన్న మహాభూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన నియోజక వర్గం లో భాగమేనా భద్రాచలం పినపాక నియోజకవర్గాలకు అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం పెరుతోటి అప్పటి కేంద్ర మంత్రి అయిన జైరామ్ రమేష్ అధ్యక్షతన ఏర్పడిన ఆర్డినెన్స్ కమిటీ అన్యాయంగా 7మండలాలను ఆంధ్రాకు కట్టపెడుతుంటే ఈ నియోజకావొర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి కేంద్ర మంత్రి ఇప్పటి కాంగ్రెసుపార్టీ అబ్యర్ధి ఏమొకం పెట్టుకొని భద్రాచలం పినపాక నియోజక వర్గాల ప్రజలను ఓట్లు అడగటానికి వస్తున్నాడు అని ఈప్రాంతానికి తీరని నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం లొనే అని .అదే BRS పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ పార్లమెంట్ లో తెలంగాణా కు జరుగుతున్న అన్యాయాన్ని నిత్యం ఎండగడుతూ కెసిఆర్ సూచనల సలహాలతో BJPఅవలంభిస్తున్న ప్రజా వెతిరేక విధానాలపై పార్లమెంట్ ను స్తంభింపచేసారని మన బాణీని వినిపించే మలోత్ కవిత గెలుపుకొఱకు అందరూ కృషిచేయాలని అన్నారు ఈకార్యక్రమంలో నియోజక వర్గ నాయకులు మనే రామకృష్ణ.సీనియర్ నాయకులు సాగి శ్రీని వాసు రాజు,అధ్యక్ష కార్యదర్శులు అన్నే సత్యనారాయణ మూర్తి, కణితి రాముడు, ఎంపిపి రేసు లక్ష్మి,ఉపాధ్యక్షులు తునికి కామేష్, అపక.వీర్రాజు.మాజీ సర్పంచులు సోడి కొండయ్య,కటిబోయిన వెంకటేశ్వర్లు,నాయకులుబొల్లి వెంకట్రావు ,కొత్త మల్లేష్, అపక శ్రీను,వెంకటేష్, కంజ నాగేశ్వరావు,పొడియం సుబ్బారావు,పాయం వెంకటేశ్వర్లు, కర్సం రాజు, తదితరులు కారం వెంకటేష్,సాగి వర్మ,కల్లూరి కామేష్,మర్మం గంగరాజు,జిలకర గంగరాజు , కట్టం నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలలో పొరపాట్లు జరగకుండా ప్రొసీడింగ్ అధికారులు చూసుకోవాలి.

వనపర్తి నేటిదాత్రి:
పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండాఎన్నికల ప్రొజెడింగ్ అధికారులు కీలక పాత్ర పోషించి చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నం దా లాల్ ప వా ర్ సూచించారు. వనపర్తి నియోజకవర్గానికి కేటాయించిన పి ఓ లు సహాయ పీవోలు నిర్వహణ ఈవీఎంల నిర్వహణపై శిక్షణ శిబిరం నిర్వహించారు .ఈ శిబిరాన్ని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందాలాల్ పవా ర్ సందర్శించి పలు సూచనలు చేశారు

వరి పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో సోమవారం రోజు పొన్నం అశోక్ పొలంలో నాలుగు మినీ కిట్టు దశలో ఉన్న వరి కే యం యం1e2368 మరియు వరంగల్1537, జేజిఎల్ 28639, ఆర్ డి ఆర్ 1200 విత్తనాలను పరిశీలించిన భూపాలపల్లి జెడి విజయభాస్కర్, అతని వెంట రైతులు మరి కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి చింత నిప్పుల మధు మరియు కిసాన్ సాంగ్ చిట్యాల అధ్యక్షులు కోడెల సమ్మయ్య జిల్లా సేంద్రియ వ్యవసాయ ప్రముఖులు కనుగుల రామ్ రెడ్డి బిల్లా సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,.

ఎమ్మెల్యే మెగా రెడ్డి 5 వార్డ్ పర్యటనకు వస్తే కాంగ్రెస్ నాయకులు దారి మళ్ళించారు

వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో 5 వ వార్డులో ప్రజా సమస్యలు మురికి కాలువల లేకపోవడం సిసి రోడ్లు లేకపోవడం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి వార్డు పర్యటనకు వస్తే కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ దారి మళ్ళించారని ఐదో వార్డు ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఐ రమేష్ గంధం నాగరాజ్ బొడ్డుపల్లి సతీష్ కుమార్ కురుమూర్తి రాములు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు వార్డులో 15 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్లాట్లు వేశారని వారి నిర్లక్ష్యం వల్ల డ్రైనేజ్ మురికి నీరు వెళ్లడానికి అవకాశం లేకుండా చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు . అక్కడ ఉన్న నివాస గృహాలకు మురికి కాల్వలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వర్షం వస్తే చెరువుల తయారై నీరు గృహాలలోకి వెళ్లే అవకాశం ఉందని క్వారు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ కౌన్సిలర్ కు ప్రస్తుతం కాంగ్రె స్ లో చేరిన కౌన్సిలర్ కు ప్రజా సమస్యలపై విన్నవించామని ఎలాంటి స్పందన లేదని సీసీ రోడ్లు మురికి కాలువలు లేకపోవడం వల్ల పందులు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు దుర్వాసనతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారి పేర్కొన్నారుబ్ ప్రజల సమస్యలు మురికి కాలువలు సిసి రోడ్లు లేకపోవడంతో ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి వార్డు పర్యటనకు వస్తే కాంగ్రెస్ నాయకులు దారి మళ్లించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డులో సమస్యలు పరిష్కరించకుంటే వార్డు ప్రజల సహకారంతో అఖిలపక్ష ఐక్యవేదిక ఆందోళన చేస్తుందని వారు హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అఖిలపక్ష ఐక్యవేదిక తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాత్కాలిక కాల్వ లు ఏర్పాటు చేయకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు వర్షం వస్తే వార్డులో నీళ్లు అక్కడ ఉన్న నివాస గ్రహ గృహాలకు వెళ్లినచో మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు

గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

హసన్ పర్తి / నేటి ధాత్రి

వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామం లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి డాక్టర్ కడియం కావ్య ను గెలిపించాలని గడప గడపకు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి గ్రామ శాఖ కమిటీతో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వేసవిలో అడవులు, ప్లాంటేషన్ లలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

టి.ఎస్.ఎఫ్.డి.సి ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్

జైపూర్, నేటి ధాత్రి :

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టి.ఎస్.ఎఫ్.డి.సి) ఆధ్వర్యంలో అటవీ, ప్లాంటేషన్ పరిసర ప్రాంతాలలో ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ అడవుల ఉపయోగాలను వివరిస్తూ వాటిలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త లు తెలుపుతున్నామని, ప్లాంటేషన్ లలో మధ్య మధ్యలో ఫైర్ లైన్స్ చేశామన్నారు. గ్రామాల్లో ప్రజలకు అటవీ సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,అటవీ ప్రాంతం లోపలికి వచ్చే పశువుల కాపర్లు, ప్రజలకు అగ్ని ప్రమాదాల వలన వచ్చే నష్టాలను వివరిస్తూ వాటిని నియత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తున్నామన్నారు. ప్లాంటేషన్ వాచర్ లు రాత్రి వేళల్లో ఎక్కడికక్కడ ఇద్దరు, ముగ్గురు కలిసి కాపలా కాస్తున్నారని చెప్పారు.అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల రేంజ్ పరిధిలో జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల లోని అటవీ ప్రాంతాలతో పాటు నీలగిరి, టేకు ప్లాంటేషన్ లు విస్తరించి ఉన్నాయని,వీటి రక్షణకు ప్రభుత్వ పరంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటూ పర్యావరణాన్ని కాపాడుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కు అడవులను కాపాడే విషయం లో ప్రభుత్వ యంత్రాంగానికి తోడు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, అక్రమ నరికివేతలు జరగకుండా, వర్షాకాలం లో మొక్కలు విరివిగా పెంచడానికి ప్రజాప్రతినిధులతో పాటు ప్రతీ ఒక్కరూ సహకరించాలని తద్వారా కొంత వరకైనా పర్యావరణం లో మార్పు సాధించవచ్చని ఆశా భావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని,అడవులు, గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో చెట్లు బాగుంటేనే అన్ని కాలాల్లో కొంత వరకు పర్యావరణ సమతుల్యత ఏర్పడి భవిష్యత్తు లో మానవాళి తో పాటు అన్ని రకాల జీవరాశులు మనుగడ సాధించగలవన్నారు.అటవీ ప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు, సిగరెట్ లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దన్నారు.

కంఠమేశ్వరుని ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్.

నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని దాసరిపల్లి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి, కంఠమేశ్వేరుని పండుగ ఉత్సవాలకు గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 4న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరిగింది.గౌడ పూజారులు సమ్మయ్య,లక్ష్మణ్,గౌడ సంఘం పెద్దల అధ్వర్యంలో సోమవారం రోజు కంఠమేశ్వరుని బోనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు వల్లాల శేఖర్ గౌడ్, సారకోల పెద్ద మనిషి వల్లాల నరేష్ గౌడ్ ,ఆలయ కమిటీ అధ్యక్షులు పెరుమాండ్ల అనిల్ గౌడ్,మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర నాయకులు మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల వెంకట్ గౌడ్, వళ్లాల శ్రీహరి గౌడ్, వళ్ళల అంకుస్ గౌడ్, ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వళ్ళాల కర్ణాకర్ గౌడ్,సట్ల రాజేందర్ గౌడ్,వల్లాల లింగమూర్తి గౌడ్, వెంకట్ గౌడ్,సూద్దాల శేఖర్ గౌడ్, వల్లాల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ పై అవగాహన సదస్సు.

చిట్యాల, నేటి దాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చిట్యాల రైతు వేదికలో మూడు మండలాలు మొగుళ్ళపల్లి టేకుమట్ల చిట్యాల అంగన్వాడీ టీచర్స్ కు ఎలక్షన్ డ్యూటీ లపైన అవగాహన సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు మరియు చిట్యాల ఎంపీడీవో జయశ్రీ పాల్గొని మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ రోజు టీచర్స్ అందరూ పోలింగ్ బూతుల వద్దకు వెళ్లి దివ్యాంగులైన వృద్ధులైన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరితో ఓటు వేయించాలని, వా రిని వరుసలో ఉంచకుండా వచ్చిన వెంటనే అవసరమైన వసతులు మంచినీళ్లు వీలుచెర్ల లొ తీసుకు వెళ్లడం చేయాలని సూచించారు, ఈ సమావేశమునకు ఐసిడిఎస్ సిబ్బంది హాజరై గ్రామాలలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని కోరి నారు, ఈ కార్యక్రమంలో సరోజ రజిత మాధవి జయప్రద సూపర్వైజర్స్ వెంకటస్వామి తిరుపతి ఐసిపిఎస్ నుండి మరియు మూడు మండలాల అంగన్వాడీ టీచర్స్ హాజరైనారు.

అ వో ప ఆధ్వర్యంలో ఉచిత చెస్ శిక్షణ శిబిరం

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో పట్టణ అ వో పా ఆధ్వర్యంలో ఉచిత చెస్ శిక్షణ శిబిరం బాలుర జూనియర్ కళాశాల ఇండోరియా స్టేడియంలో విద్యార్థులకు 8 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వరకు అర్హులని వేసవి సెలవుల నేపథ్యంలో ఉచిత చెస్ శిక్షణా శిబిరం విద్యార్థుల కు నిర్వహిస్తున్నామని పట్టణ అవోపా అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు లగిశెట్టి రవికుమార్ సం బు వెంకటరమణ జూన్ 5 వరకు చెస్ పోటీలు ఉంటాయని ఒక ప్రకటనలో వారు తెలిపారు చెస్ శిక్షణా శిబిరంలో చేరాలనుకునే విద్యార్థులు సెల్ నెంబర్ల లను 9440382985, 9849958206 , 9440268284 సంప్రదించాలి ని వారు ఒక ప్రకట నలోకోరారు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బూత్ స్థాయి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కెటి రామారావు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో స్థానిక SS. గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్రంలో దేవాలయాలు ప్రాజెక్టులు వనరులు ప్రతి గ్రామంలో రోడ్ల అభివృద్ధి కానీ పట్టణాల్లో మెడికల్ కాలేజీ గాని ఇంజనీరింగ్ కాలేజీ గాని అగ్రికల్చర్ యూనివర్సిటీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అలాంటిది రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేని బిజెపి సర్కార్ కి మోడీ ప్రభుత్వానికి ఓటు వేస్తారా అలాంటిది రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన గులాబీ కి ఓటేస్తారని ప్రజలు కోరారు రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేసుకునే దమ్ము సత్తా గులాబీ కండువకే ఉన్నది తప్ప కాంగ్రెస్కు లేదని కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారంటీలు నెరవేరుస్తామని ఒక్కటి కూడా నెరవేర్చలేదని రైతు రుణమాఫీ చేస్తామని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చాయని అలాంటి వారిని ఎదిరించాలంటే ప్రజలు గులాబీ కారు గుర్తుపై ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మండల విస్కుతస్థాయి సమావేశంలో మండల ప్రజలు పేరుపేరునా కోరుతూ వచ్చే పదవ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉన్నందున తంగళ్ళపల్లి మండలం నుంచి 15 వేల మందిని తీసుకురావాల్సిందిగా తెలియజేస్తూ వచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి విసుకుతస్థాయి సమావేశంలో జడ్పీ చైర్మన్ మాజీ జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఎంపిటిసిలు సర్పంచులు జిల్లా యూత్ నాయకులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు హాజరైనారు

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లనే చెరువులన్ని ఎండినై..

# 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన ప్రభుత్వం.
# రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి.


# మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
# 6 వ రోజుకు చేరుకున్న పెద్ది ఎన్నికల ప్రచారం..
# అడుగడుగునా మాజీ ఎమ్మెల్యే పెద్ది ఘన స్వాగతం.

నర్సంపేట,నేటిధాత్రి :

కేసీఆర్ ప్రభుత్వ గత పదేండ్ల హాయంలో నిగుకుండల్లా ఉన్న చెరువులు కుంటలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలన వలన చెరువులు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.మహబూబాబాద్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు కవిత గెలుపు కోరుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం సోమవారం నాటికి 6 వ రోజుకు చేరుకోగా దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి, తిమ్మంపేట,ముద్దునూరు,మహ్మదాపురం లతో పాటు పలు గ్రామాల్లో సాగింది ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి మంగాహరతులతో ఘన స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో మల్లంపల్లి గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం పనులు చేస్తున్న కూలీలను పెద్ది సుదర్శన్ రెడ్డి పలకరించారు.కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల నేడు గ్రామాలలో ఉన్న చెరువులన్నీ నీళ్లు లేక ఎండిపోవడం అలాగే రైతులకు రొండో పంటకు అవకాశం లేక రైతులు ఉపాధి హామీ కూలీలుగా మారారని అవేదన వ్యక్తంచేశారు.ఉపాధి హామీ చట్టాన్ని తయారు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలుపుతూ
వ్యవసాయానికి ఉపాధి హామీ పనిని అనుసంధానం చేయాలని మాజీ సిఎం కేసిఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్లో కూడా కొట్లాడడం జరిగిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశరని,డిసెంబర్ 9 న 2 లక్షల రుణమాఫీ,అన్ని పథకాలు పెంపు అని 100 రోజులు దాటినా అమలు చేయలేదని నేడు పార్లమెంట్ ఎన్నికలు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అబద్ధపు మాటలతో రైతులను బురడి కొట్టిస్తున్నారని ఆరోపించారు. ఉపాధిహామీ కూలీలకు సంవత్సరానికి 12 వేలు అందిస్తామని చెప్పడంతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 15 వేలు కౌలు రైతులకు ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందన్నారు.నర్సంపేట నియోజకవర్గంలో
సాగునీరందక పంటలు ఎండిపోయిన రైతులను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గానీ కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఆదుకోలేదని పేర్కొన్నారు.నోటికచ్చిన 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 420 దొంగ ప్రభుత్వంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు,ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తెలిపారు.
బీఅర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత గెలిపించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తెలంగాణను కాపాడుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,ఎంపిపి కాట్ల కోమల భద్రయ్య,వైస్ ఎంపిపి జైపాల్ రెడ్డి,సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి, ఎంపిటిసిలు తాజా మాజీ సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు,అర్ఎస్ఎస్ కన్వీనర్లు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

ఇండియా కూటమి అభ్యర్థిగా వామపక్షాలు బలపరిచిన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

భద్రాచలం నేటి ధాత్రి

పోరిక బలరాం నాయక్ భారీ మెజారిటీతో మెజారిటీతో గెలవబోతున్నారు

భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

మతోన్మాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బిజెపి,మతోన్మాద పార్టీలకు మన్యంలో మనుగడలేదు

సిపిఎం పార్టీ భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు

భావితరాల దేశ పౌరులు ప్రశాంతమైన జీవితం కొనసాగించాలి అంటే దేశంలో బిజెపి పార్టీని తరిమికొట్టాలి

సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం నియోజకవర్గ కేంద్రం భద్రాచలం పట్టణంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఉమ్మడి ప్రచారం మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం స్థానిక జగదీష్ కాలనీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో స్థానిక భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని ప్రజలతో మాట్లాడుతూ

గత పది ఏళ్లలో ఎంపీలుగా ఉన్న ఇద్దరు కూడా భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా, చుట్టం చూపుగా ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవారని,అలాంటి బాధ్యత లేని వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని.

మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో వామపక్షాలు మిత్రపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వస్తున్నటువంటి పోరిక బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గం లో కేంద్రం ద్వారా నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగిందని.

ప్రజలందరూ కూడా మన కోసం పనిచేసి, మన ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించగల సత్తా ఉన్న నాయకుడు బలరాం నాయక్ ని ఈనెల 13వ తారీకున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవీఎం ప్యాడ్ పై నాలుగో నెంబర్ లో ఉన్న హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు.

ప్రచారంలో భాగంగా సిపిఎం నియోజకవర్గ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు ప్రజలతో మాట్లాడుతూ

మత రాజకీయాలకు కేంద్ర బిందువు అయినటువంటి బిజెపి పార్టీకి మన్యంలో మనుగడలేదని, కేవలం మతవిద్వేషాలను రెచ్చగొడుతూ, రాజకీయ స్వాలభం కోసం మతాల పరంగా ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేసే వారికి కాలం చెల్లిందనీ, రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి బలరాం నాయక్ కి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రచారంలో భాగంగా సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్ ప్రజలతో మాట్లాడుతూ

పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిజెపి మత విద్దేశాలను రెచ్చగొడుతూ,హింసాత్మక పాలనను కొనసాగిస్తూ, స్త్రీలపై అఘాయిత్యాలను కొనసాగిస్తూ పాలన చేస్తున్నారే తప్ప, ప్రజా రంజక పాలన గురించి, యువతకు ఉద్యోగా కల్పన గురించి ఏ రోజు కూడా కేంద్రంలో ఉన్న బిజెపి ఆలోచన చేయలేకపోయిందని.

బిజెపి మూడవసారి దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని, ఇలాంటి వికృత పాలన కొనసాగించే బిజెపిని మూడవసారి అధికారంలోకి రాకుండా చేసేందుకే దేశ ప్రజల శ్రేయస్సు కోరుతూ , దేశ సమగ్రతను కాపాడేందుకు ఇండియా కూటం ఏర్పాటు చేయటం జరిగిందని.

సిపిఐ పార్టీ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ ని రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈవీఎం ప్యాడ్ పై నాలుగో నెంబర్ సీరియల్ లో ఉన్న హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన పార్లమెంటుకు పంపాలని ప్రజలకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో.

సిపిఎం నాయకులు బాల నర్సారెడ్డి బండారు శరత్ గారు,సిపిఐ నాయకులు నాయుడు రామారావు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల్ల రాము, అన్నెం రామిరెడ్డి,దుద్దుకూరు సాయిబాబా,తాండ్ర నరసింహారావు, ఇందుల రమేష్, మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, కట్ట కళ్యాణి,రూప దేవి, పద్మప్రియ , కాంగ్రెస్, సిపిఎం,సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

వేములవాడ నేటిధాత్రి

వేములవాడలోని ఎస్ఆర్ఆర్ గ్రాండ్ హోటల్లో గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2003-2004 ఘనంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో గీతా విద్యా సంస్థల పూర్వపు అధినేత అయాచితుల రాంప్రసాద్ దంపతులను స్మరిస్తూ విద్యార్థులందరూ సంతాపం ప్రకటించి విద్యార్థులకు తాను చేసినటువంటి మేలు, విద్యాభ్యాసం,సమున్నత వికాసానికి, అభివృద్ధికి తోడ్పడిన విషయాలను గుర్తు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. 20 సంవత్సరాల తర్వాత కలిసిన తన తోటి మిత్రులు మరియు విద్య నేర్పిన గురువులను చూసి చాలా ఆనందించారు ఆటపాటలతో ఆలారించారు. 20 సంవత్సరాల తర్వాత ఓకే వేదికపై చాలా ఆనందంగా ఉందని ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రస్తుత గీతా విద్యాసంస్థల కరస్పాండెంట్ అయాచితుల జితేందర్ రావు పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఆశయాల వల్ల చాలామంది విద్యార్థులు భవిష్యత్తు అద్భుతంగా ఉందని ఆయన నేర్పిన విద్యాబుద్ధులు, పెద్దలపట్ల సత్ప్రవర్తన కలిగి ఉండటం ప్రతి విద్యార్థి మంచి అవకాశాలు అందించుకొని ఉన్నత స్థానాలకు చేరారన్నారు.చాలా మంది పోలీసులుగా, తాసిల్దార్లుగా, అడ్వకేట్లుగా, రాజకీయ నాయకులుగా మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ఎదిగారాన్నారు.నేను కూడా గీతా విద్యాసంస్థల పూర్వ విద్యార్థిని అని గుర్తు చేశారు. తన తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రస్తుతం విద్యా సంస్థలను కొనసాగిస్తున్నట్టుగా, ఎందరో విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్టుగా తెలిపారు. ఇందులో భాగంగా అధ్యాపకులు మాట్లాడుతూ ఇలా అందరినీ ఒకే వేదికపై చూడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు అధ్యాపకులను మెమెంటులతో,శాలువాలతో గౌరవించారు. కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు, నామాల ప్రదీప్ కోయినేని రాజేందర్, కొడం గంగాధర్, పిట్టల శ్రీనివాస్, వేణు,సంతోష్ .రమణారెడ్డి.బాబు. శ్రీకర్ .లక్ష్మణ్.అజయ్. తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎంపీ నామ గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

కచ్చితముగా కారు గుర్తుకే ఓటు వేస్తాం అంటున్న ఓటర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్. గ్రామపంచాయతీలో భువనగిరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపీ టిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ వాల్ పోస్టర్స్ అంటిస్తూ నామా నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న శ్రీకాంత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచార సమయంలో ప్రజల నుంచి బిఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందని, కెసిఆర్ పాలనలో అందిన సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా ను గెలిపిస్తాయని చెప్పారు. ఆరు గ్యారెంటీలు, హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజలే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును విమర్శిస్తున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అసలు ఖమ్మం జిల్లాకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడిగితే బాగుండేదని, కాంగ్రెస్ బిజెపిలకు తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే కనీస అర్హత లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగిందని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దళిత బందు బీసీ బందు మైనార్టీ బందు ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా అనేకమంది లబ్ధి పొందినారని మే 13వ తారీకు జరగబోతున్న ఎంపీ టిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించి గౌతమ్ పూర్ కాలనీలో అత్యధిక ఓటు శాతం అయ్యే విధంగా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరుగుతుందని వారు అన్నారు ఖమ్మం జిల్లాలో నామ నాగేశ్వరరావుకి తిరుగులేదని వారు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శ్రీకాంత్ రాజు దానియేలు వసంత రాధమ్మ లక్ష్మి కనకం శాంత శ్వేత సింగరి లక్ష్మి మంగాదేవి ఫక్రుద్దీన్ చాకలి పాపయ్య రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు పి పి పల్లె నాగేశ్వర్ రావుని సన్మానించిన మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

మంచిర్యాల నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రానికి మొట్టమొదటి సారిగా విచ్చేసిన హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్(పి పి) పల్లె నాగేశ్వర్ రావుని మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగుండాలని తెలియజేశారు.జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు మీ యొక్క సలహాలు సూచనలకు ఇవ్వాలని కోరగా దానికి అనుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ యూత్ ఇన్చార్జ్ చుక్క శేఖర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 186వ బూత్ లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్.కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంతో ఉన్నత విద్యావంతుడైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి అభివృద్ధిలో ముందు ఉంచాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి నందగిరి హనుమాన్లు మైనార్టీ నాయకులు ఎండి హమీద్ ఎండి సలీం నస్రిన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ గెలుపుకై ఇందిరమ్మ కాలనీలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి రాత్రి

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలకు దోపిడీలకు వెన్ను దుండిగ ఉంటూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందని అటువంటి పార్టీలు 100 మీటర్ల వెయ్యిలో బొందపెట్టాలని అన్నారు అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన సొంత మేనిఫెస్టోను రూపొందించి విద్యార్థులకు ప్రజలకు మంచి చేస్తా అంటున్న మన వెలి చాలారాజేందర్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీరామ్ నరేష్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ బై రీ రమేష్ మాజీ వార్డ్ మెంబర్ రాజేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిజెపి, బీఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదు…

కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్….

కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి:-

పదేళ్ల పాలనలో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలు అభివృద్ధి చెందాలంటే ఆది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో అనేక గొప్ప ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనత తమదని అన్నారు. రాజ్యాంగం రక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలన్నారు. పేదోళ్ల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి మెదక్ అభ్యర్థి నీలంమధు ను భారీ మెజారిటీతో గెలిపించాలని మల్లేశం గౌడ్ అన్నారు .

పెరిక సంఘం గ్రామ అధ్యక్షుని ఎన్నిక.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని పెరిక సంఘం అధ్యక్షునిగా చింతకుంట గంగాధర్ గారిని సంఘ సభ్యులు ఎన్నుకున్నారు
ఉపాధ్యక్షులుగా; చింతకుంట బాపయ్య,
ప్రధాన కార్యదర్శిగా: చింతకుంట సాగర్
కోశాధికారిగా: చింతకుంట రమేష్
కార్యదర్శులుగా: చింతకుంట శ్రీనివాస్, చింతకుంట రాజేశం
కార్యవర్గ సభ్యులుగా: చింతకుంట జనార్ధన్, చింతకుంట సత్తయ్య, చింతకుంట భూమయ్య ,చింతకుంట మల్లయ్య, చింతకుంట నాగరాజు, గారిని నియమించుకోవడం జరిగింది. సభ్యులందరూ సంగతోడ్పాటుకు కృషి చేస్తామని తెలపడం జరిగింది.

error: Content is protected !!
Exit mobile version