కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన పద్మక్క.

.. జడ్పిటిసి స్థాయి నుండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ వరకు పదవులు.
.. ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన పద్మక్క
.. కెసిఆర్ ఏ ఈ పిలుపు ఇచ్చిన ముందుండి నడిపించిన పద్మక్క.
.. మెదక్ కు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన పద్మా దేవేందర్ రెడ్డి.
.. హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు.
.. అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే ధీమా……
:
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.

ఈ రోజుల్లో మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టం. ఇంటా బయట సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడుతున్న రోజుల్లో ఓ మహిళ ఉమ్మడి రాష్ట్రంలో అలుపెరగని పోరాటం చేసింది. ఆమె ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన పద్మ దేవేందర్ రెడ్డి వృత్తిరిత్య లాయర్. ఆమె భర్త కూడా అదే వృత్తి. లో సాగారు.ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినారు. పద్మ దేవేందర్ రెడ్డి కి రాజకీయాల పట్ల ఎంతో ఇష్టం ఉండడంతో పాటు తెలంగాణ సాధనలో ముందుండాలని ఆసక్తి చూపడం జరిగింది. అది గుర్తించిన కేసీఆర్ ప్రోత్సహించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో రామాయంపేట జడ్పిటిసిగా గెలుపొందారు. తర్వాత రామాయంపేట ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనివారకారణాలవల్ల రామంపేట నియోజకవర్గం డిలిమిటేషన్ లో పోవడంతో మెదక్ నుండి పోటీ చేయాల్సి వచ్చింది. అదే క్రమంలో పొత్తుల కారణంగా టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమిపాలైంది. అయినా నిరాశ చెందకుండా ఉద్యమం కోసం ఉద్యమంలో పాల్గొని కేసుల పాలు కావడం కూడా జరిగింది. సమిష్టి తెలంగాణ ప్రజల కృషి వల్ల ఏర్పడిన తెలంగాణలో మెదక్ నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ స్పీకర్ పదవి పొందారు. దీంతో పట్టు సాధించడానికి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత 2018 ఎన్నికల్లో సైతం రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహిళ కోటలో మంత్రి పదవి వస్తుందని చాలామంది ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. అయినా తాను ప్రజల్లో మమేకమై అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు. ఇది గుర్తించిన అధిష్టానం మూడోసారి కూడా మెదక్ నియోజకవర్గం టికెట్ పద్మ దేవేందర్ రెడ్డి కే కేటాయించడం జరిగింది. ఈసారి గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సాధించి అధిష్టానం నమ్మకాన్ని నిలబెడతానని దీమా వ్యక్తం చేస్తున్నారు.

… నియోజకవర్గ ప్రజలపై నమ్మకం ఉంది.. బి ఆర్ ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి.

ప్రభుత్వం మరియు నేను చేసిన అభివృద్ధి పనులు, మెదక్ నియోజకవర్గ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయాలి. ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించి భవిష్యత్తు కోసం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేవలం వ్యక్తిగతంగా రాజకీయాలు చేసేవారు కాకుండా అభివృద్ధి అందుబాటులో ఉండే వారిని గుర్తించి ఓటు వేయాలన్నారు. నేను 20 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నాను. ప్రజల్లో పద్మక్క ఎప్పుడు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!