గురుకుల బాలుర కళాశాలలో ఎస్సీ విద్యార్థులకు 10 సీట్లు ఖాళీలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల న్యాల్కల్ ప్రస్తుతం దిగ్వాల్ నందుగల జిఎంఆర్ పాఠశాల ఆవరణలో నడుస్తున్నది. ఇం దులో రెగ్యులర్ కోర్సుఅయిన ఎంపీసీ నందు ఎస్సీ విద్యార్థు లకు 10 ఖాళీలు కలవు. అదేవిదంగా ఓకేషనల్ కోర్సు అయి నటువంటి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులలో 20 ఖాళీలు ఎస్సీ విద్యార్థులకు మాత్రమేమాత్రమే కలవు. కావున ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ దృవపత్రాలతో కళాశాలలో ప్రదాన ఆచార్యులకు కలసి ప్రవేశం పొందవలసిందిగా ప్రి న్సిపల్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల వసతులు కల్పిస్తామని విద్యార్థులు సోమ, మంగళవారాలలో ఒరిజినల్ టీసీ, కుల, ఆదాయ పత్రాలతోవచ్చి ప్రవేశము పొందాలని తెలిపారు.