ప్రభుత్వకళాశాల లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఏర్పాటు చేశారు అనంతరం విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ పోటిల్లో పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కళాశాల ఆవరణలో తీరొక్క ముగ్గులు వేయాదంతో కళాశాలలో పండగ వాతావరణం చోటుచేసుకుంది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె.సంపత్ కుమార్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకొని, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎండీ సర్దార్,మహిళా అధ్యాపకులు,లత,రమాదేవి, భవాని,పద్మ,తిరుమల,జ్యోతి, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
