New SI Rajkumar Meets Jangavanigudem Sarpanch
ఎస్ ఐ ని కలిసిన నూతన సర్పంచ్
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ఎస్ఐ రాజ్‌కుమార్‌ను జంగవానిగూడెం గ్రామ సర్పంచ్ గొంది సోనీ రాజు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్ఐ రాజ్‌కుమార్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పండుగ వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జంగవానిగూడెం ఉప సర్పంచ్ అలెం మహేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సారంగపాణి, దారం భూపాల్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్‌రోలర్ చారి ఇతర గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
