నారాయణరెడ్డి ఖబర్దార్, మైనారిటీల ఆగ్రహం.

ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఆలోచన మానుకోవాలి.

పుటకు ఒక పార్టీ మరి నీకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎస్సీ సెల్.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

అమాయక ముస్లిం లకు పరామర్శల పేరుతో ముస్లింల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం బిజెపి నాయకుడు చల్ల నారాయణరెడ్డి మానుకోవాలని, పూటకు పార్టీ మారే నీకు మంథని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఖబర్దార్ అంటూ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇర్షాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు వేరు వేరు ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కి పరామర్శ పేరుతో వచ్చి, అలాగే బక్రీద్ పండుగ రోజు పలువురు మైనారిటీలకు పరామర్శన పేరుతో మంత్రి శ్రీధర్ బాబు అలాగే కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ జిల్లా మైనారిటీ శాఖ అలాగే మండల ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో, పత్రికా ప్రకటనలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఇర్షాద్ అహ్మద్ మైనారిటీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ మాట్లాడుతూ, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన హామీలు అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు, అసలు నారాయణరెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని ఎద్దేవా చేసారు, మండలంలో మైనార్టీలు నివసిస్తున్న గృహాలు అన్ని శ్రీధర్ బాబు శ్రీపతిరావు హయాంలో అందించినవి అన్న విషయం మీకు తెలవదా, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు శ్రీధర్ బాబు అప్పుడు ఎలా మంచివాడు, ఇప్పుడు ఎలా చెడ్డవాడుగా మారాడు అనేది మీ విజ్ఞతకే వదిలి పెడుతున్నామని అన్నారు. మహదేవ్పూర్ మండలం తో పాటు మంథని నియోజకవర్గంలో పరామర్శల పేరుతో అమాయక ముస్లింల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే సహించేది ఉండదని ఈ సందర్భంగా మైనారిటీ జిల్లా శాఖ చల్ల నారాయణరెడ్డి కి హెచ్చరించింది. మహదేవ్పూర్ తో పాటు నియోజకవర్గ ముస్లిం అంతా శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని మైనారిటీల మైనారిటీ శాఖ తేల్చి చెప్పింది. రోజుకు 500 లారీలు అనుమతు లేకుండా పోయినప్పుడు టిఆర్ఎస్ జాతీయ నాయకుడుగా చలామనైతున్న చల్ల నారాయణరెడ్డి ఏం చేశాడని ఈరోజు మంత్రి గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడా అని మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకారి రాజబాబు అన్నారు. ఇసుక రవాణాకు పురుడు పోసింది టిఆర్ఎస్ పార్టీ అన్న విషయం నారాయణరెడ్డి మర్చిపోయాడని ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు లారీల ప్రమాదంలో మృతి చెందిన వారిని ఎందుకు పరామర్శించలేదని, పరామర్శల పేరుతో చిల్లర రాజకీయాలకు దారిసీ తీసే ప్రయత్నం చేస్తే మంథని నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదని, ఎమ్మెల్యే టికెట్ కోసం వారానికి రెండు పార్టీలు మారిస్తే కనీసం 100 ఓట్లు రాలేదని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మె పరిస్థితి లేదు, మరొక్కసారి నిజాయితీకి మారుపేరుగా ఉన్న రాష్ట్ర మంత్రిపై బురదజల్లే ప్రయత్నం చేస్తే గ్రామాల్లో నారాయణరెడ్డి కి తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదని, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకారి రాజబాబు ఘాటైన సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మతిన్ ఖాన్, ఎండి నయుమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోహెల్, మెహరాజ్, రఉఫ్, మొఖిడ్ అలీమ్,ఉబెడ్,లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!