కోతుల బెడద తప్పించరూ మహా ప్రబో!
కోతుల బెడదతో వణికిపోతున్న జనం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో కోతులు హడలెత్తిస్తున్నాయి. కుక్కలను మించి కోతుల భయమే మండలంలోని ప్రజలను వెంటాడుతుంది మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో ఇదే తంతు జరుగు తుంది.చిన్నపిల్లలను కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరి చాయి.కోతుల బెడద తీవ్రంగా ఉందని మహిళలు ప్రజలు చిన్నపిల్లలు భయపడుతు న్నారు. వనం వీడింది జనంలోకి వచ్చింది మీ ఊరొచ్చా మీ ఇంటికి వచ్చా అంటూ ఇప్పటికే ఊర్లో సెటిల్ అయింది. కాయలు పండే కాదు మనుషులని జంక్ ఫుడ్ గడిచిన శతాబ్దం నుంచి కోతుల జనాభా అంతకంతా పెరుగుతున్నది ఇప్పుడు మండల కేంద్రంలో తక్కువలో తక్కువగా 500 నుండి750 వరకు కోతులు ఉన్నాయి. ఇంటి తలుపులు వేయడం మరిచారో ఇక అంతే సంగతులు కోతులు ఇండ్లలోకి చేరి వంట సామానులు దుస్తులు ఆహార పదార్థాలు చిందర వందర చేస్తూ భయ భ్రాంతులను సృష్టిస్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొనాల్సి వస్తుంది రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల వద్ద,హాస్టల్ వద్ద విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తు న్నాయి ఇప్పటికైనా సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు మండల అధికారులు ప్రభుత్వం స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.