న డి కూడ, నేటి ధాత్రి:
కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంటాత్మకూరు, రామకృష్ణాపురం గ్రామంలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు.అనంతరం
ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై ఎండ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే పేదల బాధలను, పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ రాలేదన్నారు,తెలంగాణను నాశనం చేశారన్నారు,మళ్లీ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ అధికారం కోసం మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు.ఈ ఎన్నికల తర్వాత
కాంగ్రెస్,బిజెపి పార్టీలు తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతాయన్నారు.
నేడు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తేనే సాధ్యమవుతుందన్నారు.ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచన చేయాలి గత పది ఎండ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలి.పనిచేసే వారికి పట్టం కట్టాలని కోరారు.పరకాల నియోజకవర్గంలో సిఎం కేసీఆర్ సహకారంతో కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుచేసుకున్నాం అందులో నిర్మానవుతున్న కంపెనీలలో నియోజకవర్గంలోని యువతకు,మహిళలకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మొదటి బాలెట్ లో మూడో నంబర్ పైన ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులే ఎమ్మెల్యే చల్లా
