పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి
ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!?
అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది.
ప్రధాన పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.!?
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
మంథని నియోజకవర్గ ప్రజలకు మరియు ఓటర్లకు నేటి ధాత్రి గత 20 రోజుల నుండి ఎన్నికల నగర మోగిన అనంతరం ఓటర్లలో చైతన్యం కొరకు నిష్పక్షంగా ఓటును వినియోగించుకోవాలని గారడీలకు ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని నేటి ధాత్రి వరుస ప్రజల్లో చైతన్యం కొరకు కథనాలను అందిస్తూ ఓటర్లకు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల వ్యవహారాలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. చివరికి నేటి ధాత్రి అక్షరాలు వాస్తవాలుగా తిరపతి కి రావడం జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి మంథని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పక్షాన ఓట్లు వేయాలని ప్రమాణాలు చేపిస్తున్న వీడియో తెరపైకి రావడం జరిగింది. నియోజకవర్గ ఓటర్లు మరియు ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనించాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీ అభ్యర్థులు పార్టీకు సంబంధించిన వ్యక్తులు ప్రజల వద్దకు వెళ్లి తమ పక్షాన ఓట్లు వేయాలని ఊరుకోవడమే తప్ప ప్రమాణాలు ప్రతిజ్ఞలు చేయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కానీ ప్రజలపై ఆ పార్టీకి నమ్మకం లేకపోవడంతో దేవుళ్ళ పేరు మీద ప్రమాణం చేయించి అభ్యర్థి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ఎన్నికల కమిషనర్ కు సవాల్ విసిరేటట్టుగా కనబడుతుంది.
చీకట్లో ఓట్ల కొరకు కాంగ్రెస్ ప్రమాణం.
నేటి ధాత్రి చెప్పినట్లే ఒక్కొక్కటి సాక్షాలుగా తెరపైకి రావడం అర్ధరాత్రి పెద్ద మొత్తంలో మహిళను గుమ్మి గూడించుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎం ఎల్ ఏ అభ్యర్థి గెలుపు కొరకు మీరు ఓట్లు వేయాలని మహిళలతో వారి ఆధ్యాత్మిక దేవుళ్ల పై ప్రమాణం చేయించి జై కాంగ్రెస్ అన్న నినాదాల వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. మంథని నియోజకవర్గం అసెంబ్లీ పరిధిలోని మహదేపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి మహదేవ్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు సుమారు వందకు పైబడి మహిళలను ఒక్కచోటకు చేర్చి ఎంపీపీ మహదేవ్పూర్ మేము పెద్దంపేట గ్రామ మహిళలము మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఎంఎల్ఏ అభ్యర్థి శ్రీధర్ బాబుకు కు తమ ఓటు వేస్తామని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము అని ప్రమాణం మరియు ప్రతిజ్ఞ మహిళలతో చెప్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాణం చేసిన వీడియో నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఒక మండల పరిషత్ అధ్యక్షురాలు మండలంలో ప్రజలకు తమ పార్టీకి మీ ఓట్లు అందించి సహకరించండి అని ప్రచారం చేయాల్సిన ఎంపీపీ దేవుని పేరుతో తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని మహిళలతో ప్రమాణాలు చేయించిన వ్యవహారాన్ని నియోజకవర్గ ఓటర్లు ప్రజలు తప్పుబడుతున్నారు.
పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంథని నియోజక వర్గం ఎన్నికలవేళ ప్రమాణాలతో ఓట్లు అడగడం అనే ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకువచ్చిందేమో ఇది ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం కాదా అని చర్చించుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని ప్రజల్లో తీసుకువెళ్లి నిర్భయంగా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్దంపేట గ్రామంలో చేసిన పనిని చూపించి తమకు ఓట్లు వేసి విజయాన్ని అందించాలని చెప్పవలసిన ఎంపీపీ దేవునిపై ప్రమాణం చేయించి మనస్ఫూర్తి ఆత్మసాక్షిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రమాణం చేయించడం ఏమిటి, ఈ వ్యవహారాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గంలో ప్రజలకు గ్రామాలకు ఏమైనా పనులు చేసిందా లేక ప్రమాణాలకు పరిమితమై ఓట్లు వేయించుకునే క్రమంలో ఉందా అన్నట్లుగా ఉంది ఈ ప్రమాణాల వ్యవహారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని చూసి నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేస్తారు, కానీ ప్రజా ప్రతినిధులు వెళ్లి అమాయక మహిళలను పెద్ద మొత్తంలో ఒకచోటు చేర్చి కాంగ్రెస్ పార్టీకి మీ దేవుని పేరు మీద ఒట్టేసి ఓటు వేస్తామని ప్రమాణం చేయించుకుంటే అమాయక మహిళలు దేవుడు మీద ప్రమాణం చేసి ఉన్నాము కదా లేకుంటే తమకు భవిష్యత్తులో ఏమవుతుందో నని భయభ్రాంతులకు గురై కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓట్లు వస్తాయని ఆలోచనతోనే ప్రమాణాలు చేయించు కుంటున్నారేమో అని చెప్పడంలో సందేహం కాదు సాక్ష్యమే నియోజకవర్గ ప్రజల ముందు ఉంది.
ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!?
ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు సుమారు 28 రోజులు అభ్యర్థులకు నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి వారు గతంలో నియోజకవర్గంలో ఎంఎల్ఏ లుగా కొనసాగితే మీరు ప్రజలకు చేసిన సేవలను వారి దృష్టిలో పెట్టి తిరిగి గతం కంటే రాబోయే రోజుల్లో మంచి పని చేస్తామని, అలాగే ఇతర పార్టీ మరియు స్వతంత్ర అభ్యర్థులు భవిష్యత్తులో ప్రజలకు ఒక సిపాయిలాగా బడుగు బలహీన కుల మత భేదం లేకుండా పట్టణాలు గ్రామాల్లో అభివృద్ధి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల వద్దకు అందేలా ప్రజల్లో ఒక వ్యక్తిగా ప్రజలకు సహాయ సౌకర్యాలు అందించేలా చేస్తాము తమకు మీ ఓటుతో ఆశీర్వదించండి అని ప్రజల్లో అభ్యర్థులు భవిష్యత్తు తో పాటు గతంలో చేసిన పనులను వివరిస్తూ తమకు ఓటు వేయాలని కోరడం కొరకు ఎన్నికల సంఘం ప్రచారాల కొరకు సమయాన్ని ఇచ్చింది. కానీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రం ప్రచారాల సమయంలో ప్రమాణాలు చేయిస్తూ అమాయక మహిళలను ఆధ్యాత్మిక దేవుళ్ల పై ప్రమాణం చేపించి గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభాలకు గురి చేస్తూ ప్రచారం పేరుతో ప్రమాణాలు కొనసాగించడం కచ్చితంగా తమకే ఓట్లు వేయడానికి దేవుళ్లపై ప్రమాణాలు చేయించుకోవడం ఒకవైపు ఆశ్చర్యానికి గురి చేస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎప్పుడు వచ్చి తమతో ప్రమాణం చేపించుకుంటారేమో నియోజకవర్గ ఓటర్లు కాస్త భయందోళన కు గురయ్యే పరిస్థితి ఈ దారితీస్తుంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల నిబంధనలను ప్రచారంలో ప్రమాణాలు చేయించుకోవడం నిబంధనలో వస్తుందా లేక నిబంధనలకు విరుద్ధఎం అనేది ఎన్నికల అధికారులే నిర్ణయించాలి.
అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది.
నియోజకవర్గ ప్రజలకు నేటి ధాత్రి గత 25 రోజుల నుండి రాజ్యాంగం అందించిన అమూల్యమైన ఓటును ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నిర్భయంగా నియోజకవర్గ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు చైతన్యవంతం చేస్తూ రాజకీయ పార్టీల వ్యవహారాలను నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతూ ప్రజలకు మరియు ఓటర్లకు వాస్తవాలతో చైతన్యం తీసుకువచ్చే విధంగా కథనాలు అందిస్తున్న నేటి ధాత్రి నేడు ప్రధాన పార్టీల వ్యవహారం కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుంది. చివరికి నీటి ధాత్రి చెప్పిందే వాస్తవాలు తెర పైకి రావడం జరుగుతుంది. ప్రధాన పార్టీల మాయలో పడద్దని అమాయక ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుందని గత 20 రోజుల నుండి నేటి ధాత్రి, చెప్పుకుంటూనే వస్తుంది, చివరికి అదే సాక్ష్యంగా అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి చీకట్లో మహిళలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని దేవుడు మీద ప్రమాణం చేయించిన వ్యవహారం నియోజకవర్గ ఓటర్ల ముందు ఉంది. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలు ఓటర్లు తమ ఓటు వినియోగించుకునే విషయంలో ఒక నిష్పక్షంగా మీ సమస్యలను పరిష్కరించే వ్యక్తిని మీ ఓటు హక్కుతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రమాణాలు చేయించుకునేవారు రేపు భవిష్యత్తులో మీకు ఆధ్యాత్మికంగా మీ దేవుళ్లను సాక్షిగా పెట్టి పని అడుగుతే ఒట్టు వేసుకునే పరిస్థితి వరకు దారితీస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రధాన పార్టీ కాంగ్రెస్,టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.
ప్రస్తుతం మంథని నియోజకవర్గం లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి లపై ప్రజలకు నమ్మకం లేదు అనడానికి పెద్దంపేట గ్రామంలో ప్రమాణం చేయించడమే సాక్ష్యం. నియోజకవర్గాన్ని కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీలు పరిపాలించినప్పటికీ నేడు ప్రజల్లో ఏ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు అనేది కేవలం ఎన్నికలు తొమ్మిది రోజులు ఉన్నప్పటికీ స్పష్టత లేకపోవడం తో పాటు పార్టీలో ప్రజా ప్రతినిధులుగా కొనసాగే వ్యక్తులు గ్రామాల్లో వెళ్లి అర్ధరాత్రి వేళ దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ఆత్మ సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రమాణాలు చేసుకునే పరిస్థితికి రావడం జరిగిందంటే ప్రధాన పార్టీల వ్యవహారం అభ్యర్థులపై నియోజకవర్గ ఓటర్లలో నమ్మకం లేదన్నడానికి దీనికంటే బలమైన సాక్ష్యం అవసరం లేదు. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పాలించినప్పటికీ కూడా గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న పార్టీ అభ్యర్థులు మరి వారు చేసిన పనికి నియోజకవర్గ ప్రజలు ఓటు వేయక తప్పదు కానీ దేవునిపై ఒట్టేసి తమ పార్టీకి ఓటు వేయాలని ప్రమాణం ఎందుకు చేయించు కుంటున్నారు. ప్రజలకు పార్టీలపై నమ్మకం లేదా లేక పార్టీలకు ప్రజలపై నమ్మకం లేదా అనేది ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్న వ్యవహారం కానీ వాస్తవం ఏమిటంటే ప్రధాన పార్టీకు నియోజకవర్గ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి తమ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కొరకు మహిళలతో దేవుని పేరుపై ప్రమాణం చేసుకొని ఓటు వేయించుకునే ప్రయత్నం అన్నది వాస్తవం.