సమీక్ష సమావేశం లో పాలొన్న మంత్రి జూపల్లి

వనపర్తి నేటిధాత్రి
ప్రజలు మెచ్చే విధంగా, ప్రజాపాలన అందించేందుకు అధికారులు సహకారం
అందించాలని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వీపంగండ్ల, చిన్నంబావీ, పానగల్ మండలాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై మంగళవారం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు నచ్చే విధంగా ప్రజాపాలన అందించేందుకు కృత నిశ్చయంతో ఉందని అందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన తాగు నీరు,మేరుగు అయిన వైద్య ము అందుబాటులో ఉండాలని పరిశుభ్రమైన తాగు నీటిని అన్ని కుటుంబాలకు సమానంగా అందించే విధంగా ఆర్.డబ్లు.ఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు
గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చిన నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు ప్రతులు పంపించి పారిశుధ్య పనులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు అంబులెన్స్ సౌకర్యం కల్పించండి. అవసరమైన నిధులను అందిస్తాం. కలెక్టరేట్ నుండి పెట్రోల్, లూబ్రికెంట్, డ్రైవర్ ఖర్చులు భరిస్తామని సూచించారు. రేమద్దుల గ్రామంలో నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ఆధీనంలో తీసుకొని వైద్య సేవలు అందించేందుకు మల్టి లెవల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్ ను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించా.రు.విద్యా శాఖ
జిల్లాలో మొత్తం విద్యార్థులు ఎంతమంది, ఉపాద్యాయులు ఎంతమంది, ఉపాద్యాయులు ఖాళీలు ఎన్ని ఉన్నాయని విద్యా అధికారినీ అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు 54,306 మంది విద్యార్థులు, 2026 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, 364 ఖాళీలు ఉన్నట్లు డి. ఈ. ఒ గోవిందరాజులు వివరాలు వెల్లడించారు.
చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో కొరత ఉన్న సబ్జెక్టు టీచర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెద్దదగడ, పెద్ద మరూర్ లోని ప్రభుత్వ పాఠశాల, ఉన్నత పాఠశాల మొత్తం 4 పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల్లో సైతం లేని విధంగా అన్ని వసతులు కల్పించాలని, వీటిని రెసిడెన్షియల్ పాటశాల మాదిరిగా ప్రత్యేక బోధన అందించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని, ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు సైతం అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నాడు
వనపర్తి జిల్లాలోనీ అన్ని పాఠశాలలకు బాల బాలికలకు అవసరమైన మరుగుదొడ్లు రన్నింగ్ వాటర్ సౌకర్యం తో ఏర్పాటు కావాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేసి 15 రోజుల తర్వాత ఎక్కడా మరుగుదొడ్ల సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. పాఠశాలలను ప్రతిరోజూ పరిశుభ్రం చేయించే బాధ్యతను పంచాయతీ సెక్రటరీకి అప్పగించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో పెద్ద సైజు చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు . ఉపాధి హామీ ద్వారా పనులు చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులు జారీ చేసి పనిదినాలు పెంచాలని ఆదేశించారు. లేబర్ కాంపోనెంట్ పెంచి మెటీరియల్ కపోనెంట్ అధికంగా మంజూరు అయ్యే విధంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
సీసీ రోడ్లు, బి.టి రోడ్లు మంజూరు అయిన వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ద్వారా తగిన సమా ఇలాంటి నిర్లక్షఅనంతరం రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజల భూ సమస్యలు ఫిర్యాదుల పై ఫిర్యాదు వారీగా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, జిల్లా అధికారులు, ఆర్డీవో, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *