కూకట్పల్లి జూన్ 11 నేటి రాత్రి ఇంచార్జ్
124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని శ్రీ తులసి నగర్ లో సీసీ రోడ్ల కొరకు గతంలో ఇరవై లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది.ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నా ణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, సన్యాసిరావు,సంతోష్ బిరాదర్, శ్రీనివాస్ గౌడ్, జైపాల్, శివ, బసవరెడ్డి, సుందరం, బి.వేణు, రమేష్, శోభారాణి, నాగలక్ష్మి. జి.ఎచ్.ఎం.సి అధికారులు ఎఇ శ్రావణి, వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్, ఎస్.ఆర్.పి నాగేశ్వర్ నాయక్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసిం హులు, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.