ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
ఎంహెచ్పీఎస్ అన్ని వర్గాల మేలుకొరకు పోరాటం చేస్తుంది
ఎంహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ
పరకాల నేటిధాత్రి:

మాదిగల రిజర్వేషన్ ప్రకారం రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్,స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కు అనుకూలంగా ప్రత్యేక సీట్లు కేటాయించాలని
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎంహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మైస ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ మాదిగల హక్కులను సాధించే దిశగా కొన్ని దశాబ్దాల ఉద్యమ కాలంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి క్రియాశీలకంగా పనిచేసిందని ఆవిర్భావం నుండి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.గత ప్రభుత్వంలోని దళిత బంధం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని అమలులో ఉంచాలని కోరారు.గత డిసెంబర్ నెలలో జరిగినటువంటి గ్రూపు-2 గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల రిజర్వేషన్ అమలు చేసి మరోసారి మాదిగల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడాలని ఎస్సీల వర్గీకరణ మాదిగ అమరవీరుల విజయమని,నామినేటెడ్ పదవులలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వాలని మైస ఉపేందర్ మాదిగ అన్నారు.ఈ కార్యక్రమము లో
మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొల్లికొండ వీరేందర్ గజ్జల మల్లేష్,పుల్ల రమేష్ ఎంహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు (వరంగల్ జిల్లా)వంతడుపుల అవినాష్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,కందుకూరి ప్రభాకర్ఎంహెచ్పీఎస్ హనుమకొండ(జిల్లా ఇన్చార్జి), మందా ఆరోగ్యం,సిలుముల రాజు,బరిగల బాబు,ఒసేపాక రవి,మున్నా తదితరులు పాల్గొన్నారు.