కుంగ్ పూ,కరాటేలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్
గుండాల ఎంపీపీస్ విద్యార్థులు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం లో ఆదివారం జరిగిన కుంగ్ పూ, కరాటే పోటిల్లో గుండాల ఎంపీపిఎస్ స్కూల్ విధ్యార్థులు ఏడు గోల్డ్ మెడల్స్ సాధించారు. వారు ఎస్కె ముఖీన, గుండెబోయిన ఈషిత, ఈసం అరుణ శ్రీ,షైనిస్(స్టూడెంట్), అరేం హర్షవర్ధన్,చీమల మహివరున్, బియ్యాని మైతిలి, సిల్వర్ మెడల్స్,ఎస్కె ముదాజిర్, రాఘవి సాదించారు. ముఖ్య అతిధిగా గుండాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్, వాసవి క్లబ్ గుండాల అధక్షులు వనాల శ్రవణ్, శరత్, తవిడిశెట్టి నాగరాజు, రాంబాబు, ఎట్టి సుందర్ . ఎంపీపీ స్కూల్ ఎచ్ఏం బి. రమేష్, సహా ఉపాధ్యాయులు,పిల్లల తల్లి దండ్రులు, కరాటే మాస్టర్ మంకిడి సుధాకర్ మెడల్స్ సాదించిన విద్యార్థులకు మాస్టర్ కు తల్లి దండ్రులకు చాలువాలతో సన్మానించారు.