యాదాద్రి భువనగిరి నేటి ధాత్రి
చౌటుప్పల్:మండలం లోని దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన కీర్తిశేషులు మాజీ సర్పంచ్ బూడిద లక్ష్మమ్మ మూడో వర్ధంతి సందర్భంగా వారి కుమారులు బూడిద యుగంధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి ,డాక్టర్ నరేందర్ రెడ్డి తమ సొంత గ్రామమైన దేవలమ్మ నాగారంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ మరియు ఎల్బీనగర్ బ్రాంచ్ మరియు ఎం ఎం క్యాన్సర్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ చేత పరీక్షలు నిర్వహించారు గ్రామంలో ఉన్న వృద్ధులకు కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు వారి కుమారులు మాట్లాడుతూ తమ సొంత గ్రామమైన పేద వృద్ధులకు అవసరమైన మోకాళ్ల పరీక్షలు మరియు నోటికి సంబంధించిన క్యాన్సర్ పరీక్షలు మరియు మహిళలకు అవసరమైన గర్భసంచి పరీక్షలు వివిధ రకాలైన స్కానింగ్లు ఉచితంగా చేశారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ చెందిన మొబైల్ బస్సు లో స్కానింగ్ టెస్ట్ లో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేందర్ రెడ్డి , డాక్టర్ స్వామి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ బి శశిధర్ రెడ్డి ,డాక్టర్ విజయరావు, డాక్టర్ ఐలయ్య మహాదేవ్ ,డాక్టర్ టీవీ శ్రీని, డాక్టర్ రవీందర్ ,గ్రామ సర్పంచ్ కళ్లెం శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, బాలరాజ్ మాజీ సర్పంచ్, మహేందర్ మాజీ ఉపసర్పంచ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.