మానవత్వానికే మచ్చ మల్క?

https://epaper.netidhatri.com/

నమ్మించి మల్క నయవంచన?

కార్మికుల పొట్టగొట్టిన మల్క?

వంద కుటుంబాలను ఆగం చేసిన మల్క మల్కాజిగిరికి మేలు చేస్తాడా?

కార్మికుల పొట్టకొట్టి, వారి జీవితాలను చీకట్లోకి నెట్టి!

వంద మందికి అన్యాయం చేసిన మల్క, ఇరవై లక్షలమందికి న్యాయం చేస్తాడా?

నీ కార్మికులకే తోడు కాలేదు, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడతావా?

నీ కార్మకులకే రక్ష కాలేదు, మల్కాజిగిరికి సురక్షవౌతావా?

అవ్వకు బువ్వ పెట్టలేనోడు, చిన్నమ్మకు చీరకొనిస్తాడా?

కార్మికులు చేసిన కష్టాన్నే దోచుకున్న మల్క, నాయకుడై మేలు చేస్తాడా?

శ్రమ దోపిడీ చేసిన మల్క, ప్రజల కోసం పాటుపడతాడా?

కార్మికుల చేత వెట్టి చాకిరికి చేయించుకున్న వ్యక్తి సమాజాన్ని ఉద్దరిస్తాడా?

శాలివాహన పవర్‌ ప్లాంట్‌ కార్మికులు నేటిధాత్రితో మొర.

మల్క మోసాలు తెలుపుతూ ‘‘నేటిధాత్రి’’కి బాధితుల లేఖ.

‘‘నేటిధాత్రి’’ కి మల్క బాధితుల ఫోన్లు.

మానవత్వానికే మచ్చ మల్క కొమురయ్య? ఇది నేటి ధాత్రి అంటున్న మాట కాదు. నేటిదాత్రికి లేఖ రాసిన బాధితులు చెబుతున్న మాట. ఆకలి నుంచి పుట్టిన ఆక్రోశం వెల్లగక్కుతున్న మాట. పద్నాలుగు నెలలుగా పస్తులుంటూ, పిల్లా, జెల్లాతో కష్టం ఎల్లదీస్తున్న కార్మికుల నోటి నుంచి వస్తున్న మాట. ఇరవై ఏళ్ల క్రితం శాలివాహన పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేసి, తమ భూములు తీసుకొని, అక్కడే తమకు ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మించి ఇప్పుడు మోసం చేస్తున్న మల్క కొమురయ్యకు శాపాలు పెడుతున్న కార్మికులు చెబుతున్న మాట. తమను పనుల్లో పెట్టుకొని నమ్మించి నయవంచన చేసిన మల్క కొమురయ్య? అంటూ తమ గోడు వెల్లబోసుకుంటున్న కార్మికుల మాట. గడచిన పద్నాలుగు నెలల కాలంగా తాము పడుతున్న కష్టాన్ని, మల్క కొమురయ్య చేసిన అన్యాయాలు వివరిస్తూ, నేటిధాత్రికి బాదితులు లేఖ రాశారు. ఆ లేఖలో వారి గోడు వెల్లబోసుకున్నారు. తమ కష్టం చెప్పుకున్నారు. తమ కష్టం ఎంత మందికి చెప్పుకున్నా తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింది స్ధాయి ప్రభుత్వ అధికారి నుంచి రాష్ట్ర స్ధాయి అధికారుల వరకు తాము తమ గోడు చెప్పుకున్నాం. వినతిపత్రాలు ఇచ్చాం. న్యాయం చేయమని కోరాం. కార్మిక చట్టాలు అమలు చేయాలని వేడుకున్నాం. మల్కకొమురయ్య నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కాళ్లా వేళ్లా పడ్దాం. అయినా మారి కోరికలు తీరడం లేదు. మా ఆకలి చల్లారడం లేదు. శాలివాహన పవర్‌ ప్లాంటు ఏర్పాటు నుంచే వెట్టి చాకిరి చేయించుకుంటున్నా, చాలీ చాలని జీతాలు ఇస్తున్నా, మంచి రోజులు రాకుండాపోతాయా? అన్న నమ్మకంతో ఇరవై ఏళ్లు పనిచేసినా, మాకు మిగిలింది ఆకలే అని కార్మికులు కంట కన్నీరు పెట్టుకుంటున్నారు.
కార్మికుల పొట్టగొట్టిన మల్కకొమురయ్య? అంటూ తమకు ఎలాగైనా న్యాయం చేయమంటూ కార్మికులు నాయకులందరి చుట్టూ తిరిగారు. వాళ్లకు కూడా తమ గోడు వెల్లబోసుకున్నారు. కాని వాళ్లు కూడా చేసిందేమీ లేదు. నాయకులు కూడ పేదల పక్షాన నిలబడలేదు. పెత్తందారులకు వత్తాసు పలికారు. ఏనాడు మల్క కొమురయ్యతో వారు మాట్లాడిరది లేదు. తాజాగా కూడా తమ ఎమ్మెల్యే కు మరోసారి వినతిపత్రం అందించారు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. గత కొంత కాలంగా నిత్యం శాలివాహన పవర్‌ ప్లాంటు ముందు నిరసన దీక్షలు చేస్తున్నారు. అయినా కొమురయ్యకు కనికరం రావడం లేదు. వారిని కరుణించాలని అనిపించడం లేదు. వారికి న్యాయంగా అందాల్సిన వాటని ఇవ్వడం లేదు. పైగా ఎంత మందికి చెప్పుకుంటారో చెప్పుకోండి? ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి? ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి? అంటూ అంటున్నాడే తప్ప, మానవత్వంచూపించడం లేదని కార్మికులు అంటున్నారు. తమ శ్రమతో ఎదిగి, తమ చెమట చుక్కలను నోట్లుగా మార్చుకొని, కోట్లు గడిరచి, అందలమెక్కి, మా భూములు తీసుకొని మమ్మల్ని బజారున పడేసిన మల్క కొమురయ్య మల్కాజిగిరి నుంచి పోటీచేస్తానంటున్నాడు. వంద మందికి న్యాయం చేయని కొమురయ్య ప్రజలకు న్యాయం చేస్తాడా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఒక వేళ ఆయన ఎన్నికల్లో నిలబడితే మేం వంద కుటుంబాలే కాదు, ఆయన బాధితులమంతా ఎన్నికల్లో మల్క అసలు స్వరూపం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.
వంద కుటుంబాలను చీకట్లోకి నెట్టేసిన మల్క కొమురయ్య మల్కాజిగిరి ప్రజలకు వెలుగు పంచుతానంటే నమ్మడానికి మల్కాజిగిరి ప్రజలేమైనా మాలాగా ఏమైనా అమాయకులా? మేమంటే పొట్టకూటి కోసం నమ్మాం. కాని దేశ భవిష్యత్తును మల్కాజిగిరి ప్రజలు మల్క చేతిలో పెడతామంటే ఊరుకుంటామా? వారిని చైతన్యం చేయకుండా వదిలేస్తామా? వంద కుటుంబాలకు అన్యాయం చేసిన వ్యక్తి ఇరవై లక్షల మందికి మేలు చేస్తాడంటే ఎవరూ నమ్మరు. ఇప్పటికే మల్క కొమురయ్య బాగోతాలు తెలంగాణ మొత్తం తెలిశాయి. మోసాలన్నీ బైటపడుతున్నాయి. అంటూ కార్మికులు నేటిధాత్రిలో చెబుతున్నారు. తన ఎదుగుదలకు ప్రత్యక్షంగా ఉపయోగపడిన శాలివాహన పవర్‌ ప్లాంటులో పని చేసిన కార్మికులకే న్యాయం చేయని వ్యక్తి తెలంగాణ అభివృద్దికి తోడ్పాటు అవుతానని చెబితే ప్రజలు నమ్మకండి. నీడనిచ్చిన మా లాంటి వాళ్లనే ఎండలో నిలబెడుతున్నాడు. మా గోస పచ్చుకుంటున్నారు. మమ్మల్ని హరి గోస పెడుతున్నాడు. మా కష్టంతో కోట్లు గడిరచి, ప్రజలు మోసం చేయాలని చూస్తున్నాడంటూ కార్మికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీ కార్మికులకే రక్ష కాలేని మల్క మల్కాజిగిరి ప్రజలకు సురక్ష అవుతావా? అని నిలదీయాలని చూస్తున్నారు. వారికి భయపడి కార్మికులకు ఎదరు పడుడం లేదు. కార్మికుల కష్టాన్ని దోచుకున్న మల్క ఎట్టి పరిస్ధితుల్లో మల్కాజిగిరి ప్రజలకు సేవ చేయలేడు. తన వ్యాపార సామ్రాజ్యం పెంచుకోవడం కోసమో, తమన మోసాలు కప్పిపుచ్చుకోవడం కోసమో రాజకీయాలు వినియోగించుకుంటాడే గాని, ప్రజలకు మేలు చేసే వ్యక్తి కాదని కార్మికులు అంటున్నారు. శ్రమ దోపడీకి పాల్పడిన వ్యక్తి సమాజాన్ని ఉద్దరిస్తాడా? వెట్టి చాకిరీ చేయించుకున్న వ్యక్తి ఇతరులకు చేయూతనందిస్తాడా? ఇదీ కార్మికులు సంధిస్తున్న ప్రశ్నలు. వీటికి మల్క కొమురయ్య సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. ప్రజా జీవితంలోకి వచ్చేవారు ఎలాంటి మచ్చ లేని నాయకులై వుండాలి. ప్రజలకు మేలు చేసేవారై వుండాలి. ప్రజలకు ఏ ఆపద వచ్చినా తీర్చేలా వుండాలి. అర్దరాత్రి తలుపు తట్టినా సాయం చేసేలా వుండాలి. మరి మల్క కొమురయ్య చేస్తున్నదేమిటి? కార్మికులను కష్టాలలోకి నెట్టి, వెట్టితో వారి జీవితాలను చీకట్లోకి నెట్టి, రాజకీయం చేస్తాను. ప్రజలకు సేవ చేస్తాను. మల్కాజిగిరిని అభివృద్దిచేస్తాను. తెలంగాణకు పేరు తెస్తాను. నమ్ముకున్న వారికి న్యాయం చేస్తాను. వారికి తోడుగా వుంటాను. అండగా వుంటాను. ఆపదలో అదుకుంటానని అంటే ఎవరైనా నమ్ముతారా? అని శాలివాహన కార్మికులు లక్ష ప్రశ్నలు సందిస్తున్నారు. అంతే కాదు మల్క కొమురయ్య బాధితులు నిత్యం నేటిధాత్రికిపోన్లు చేస్తున్నారు. లేఖలు రాస్తున్నారు. వారి గోడు వినిపిస్తున్నారు. తమ సమస్యలు ప్రపంచానికి తెలియజేయమని కోరుతున్నారు. మాకు న్యాయం జరిగేదాకా అక్షర సాయం చేయమంటున్నారు. అందుకే వారికి నేటిధాత్రి అండగా నిలిచింది. వారికి పక్షనా అక్షర పోరాటం చేస్తోంది. వారి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటోంది.
మల్క బిజేపి తీర్ధం పుచ్చుకోలేదా? చిత్రగుప్తా?
ఒక్కసారి మల్కాజిగిరి మొత్తం కలియ తిరిగి చూడా చిత్ర గుప్తా. వీది వీదినా, అడుగడునా, ఏ గోడ చూసినా మల్క కొమురయ్య పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. బిజేపి నాయకుడు కొమురయ్య అంటూ పోస్టర్లు వెలిశాయి. మల్క కొమురయ్య బీజేపి సభ్యత్వం తీసుకోకుండానే ఈ ప్రచారం చేసుకుంటున్నాడా? చిత్రగుప్తా? ఏది నిజమో? ఇప్పటికైనా చెప్పు చిత్ర గుప్తా? ఎందకంటే నేటిధాత్రి ఎది చెప్పినా నిజం చెప్పడమే తెలుసు. నిజాలను నిర్భయంగా చెబుతుంది. అన్యాయాలను చీల్చి చెండాడుతుంది. నేటిధాత్రి వార్తను ఉటంకిస్తూ మల్క బిజేపి నాయకుడే కాదని తీర్పిచ్చిన చిత్రగుప్తా? కొమురయ్య పోస్టర్లు జనానికి చూపించు. అసలు నిజం ప్రజలు చెప్పు. అసలు మల్క కార్మికులను మోసం చేసినట్లు బిజేపిని కూడా మోసం చేస్తున్నాడా? లేక బిజేపిలో చేరిన పార్టీని, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడా? ఏది నిజం? ఏది అబద్దం? కార్మికులను మల్క మోసం చేశాడన్నది నిజం. ఎందుకంటే కార్మికులు నేటిధాత్రిని ఆశ్రయించారు. తమ గోడు వెల్లబోసుకున్నారు. మల్క పేరు మీద పోస్టర్లు వెలిశాయి. దాని ఆధారంగానే మల్క బిజేపి నేత అని చెప్పింది. ఇందులో రెండూ నిజమే. ఆ నిజమే నేటిధాత్రి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *