అక్రమ కట్టడాలపై అదనపు కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

తాటిపల్లి శ్రీనివాస్ పై విచారణ చేపట్టాలి

జైపూర్, నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా రైస్ మిల్లు కట్టడం జరుగుతుందని దానితోపాటు అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తున్నారని శుక్రవారం రోజున మండల కాంగ్రెస్ నాయకులు అదనపు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన డీలర్ శ్రీనివాస్ అని పిలువబడే,అలియాస్ తాటి పెళ్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రామారావు పేట గ్రామంలో 210, 218, 219, సర్వే నెంబర్లో ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లు అక్రమంగా కట్టడం జరుగుతుందని దానితోపాటు ఇసుక, మట్టి ని అక్రమంగా తరలిస్తున్నారని కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో శ్రీనివాస్ రేషన్ డీలర్ గా పనిచేసి రెవెన్యూ అధికారులతో పరిచయాలు చేసుకొని ఇసుక మాఫియా వ్యవహారం నడిపించాడని అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయన్నారు.అదే గ్రామంలో ఇరిగేషన్ వారి ఆధ్వర్యంలో నవాబ్ కుంటలో తన కుటుంబ సభ్యులపై అక్రమంగా పట్టాలు చేయించుకొని నష్టపరిహారం తీసుకున్నడని అలాంటి వ్యక్తి కి ఎలాంటి పరిమిషన్ ఇవ్వకూడదని అతని రేషన్ డీలర్ రద్దుచేసి విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫయాజుద్దీన్, జిల్లా నాయకులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, విశ్వంభర్ రెడ్డి సుంకరి శ్రీనివాస్, గూడెల్లి శ్రీనివాస్, తిరుపతి, రాజు, షేక్ షరాఫ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *