మందరాజు మాదిగ పరకాల నియోజకవర్గం ఇంచార్జ్
పరకాల నేటిధాత్రి
1ఏప్రిల్ న పరకాలలో జరిగే నియోజకవర్గ స్థాయి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల సదస్సుకు ముఖ్యఅతిథిలు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు కావున సభను విజయవంతం చేయాలని ఏకు శంకర్ మాదిగ పిలుపునిచ్చారు.అనంతరం పరకాల కేంద్రంలో మంద రాజు మాదిగ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్గొని ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులతో మాట్లాడుతూ జాతి భవిష్యత్తు ఎస్సి ఏబిసిడి వర్గీకరణ పై ఆధారపడి ఉందని మాదిగ మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరగాలంటే వర్గీకరణ లక్ష్యం గా 29 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తు అనగారిన వర్గాల పక్షాన మాట్లాడుతున్న ఏకైక గొంతుక మందకృష్ణ మాదిగేనని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో చాతాళ్ళ రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇనుముల పూర్ణయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దామెర రవి మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొచ్చు ప్రశాంత్ మాదిగ,ఎమ్మెస్ ఎఫ్ పట్టణ అధ్యక్షులు బొట్ల యాకూబ్ మాదిగ,కోగిల రమేష్ మాదిగ,రాజేష్ మాదిగ
తదితరులు పాల్గొన్నారు.