మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా లోని అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణ లో భాగంగా సోమవారం రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని రాజేంద్ర నగర్ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా విద్యార్థులకు పాఠశాలలో వసతులు మరుగుదొడ్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేంద్రనగర్ పాఠశాల ఉపాధ్యాయులుతదితరులు పాల్గొన్నారు