కానిస్టేబుల్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశంసలు.
గ్రేట్ పోలీస్ అంటూ సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్.
మహాదేవపూర్ నేటి ధాత్రి
ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సి పి ఆర్ అందించి ప్రాణాలు కాపాడిన మహాదేవపూర్ కానిస్టేబుల్ గోల్కొండ కిరణ్ తో పాటు సిఐ రాజేశ్వరరావు లకు మహా పోలీస్ శభాష్ అని ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం రోజున గ్రూప్ వన్ పరీక్ష బందోబస్తు కొరకు కానిస్టేబుల్ కిరణ్ తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న భీమయ్య ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో అపాస్మకర స్థితిలోకి వెళ్లాడు. భీమయ్య గమనించిన కానిస్టేబుల్ కిరణ్ సుమారు మూడు నిమిషాల పాటు ఛాతిపై సిపిఆర్ చేయడం తో భీమయ్య తిరిగి స్పృహలోకి రావడం జరిగింది. విధులు నిర్వహిస్తున్న సిఐ రాజేశ్వరరావు తక్షణమే 108 వాహనానికి సమాచారం ఇచ్చి స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. భీమయ్య స్పృహలోకి వచ్చి ప్రాణాపాయం నుండి బయటపడడం జరిగింది. మహా పోలీస్ చేసిన పనికి ఒక నిండు ప్రాణం కాపాడడం జరిగిందని సామాజిక మాధ్యమంలో కానిస్టేబుల్ కిరణ్ తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు భీమయ్యకు సిఆర్పి అందిస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ గ్రేట్ శభాష్ ప్రౌడ్ ఫుల్ పోలీస్ అని పోస్టులు పెట్టడంతో పాటు జిల్లావ్యాప్తంగా వాట్స్అప్ స్టేటస్ లో భీమయ్యకు సి పి ఆర్ చేస్తున్న ఫోటో ను పెట్టుకోవడం జరుగుతుంది.