ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని 14 వ వార్డు వీరన్న పేట లో కోటి 69 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు ఇతర అభివృద్ధి పనులకు మహబూబ్ నగర్ ఎంపి శ్రీమతి డికె అరుణ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పది లక్షల రూపాయలతో నిర్మించిన యువజన సంఘం కమ్యూనిటీ హాల్ ను వారు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం స్వయంభూ గా వెలసిన ఆంజనేయ స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత వార్డు లో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ అచ్చుగట్ల అంజయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు బండి మల్లేష్ యాదవ్, కుర్వ నరేష్, లీడర్ రఘు, బిజెపి సీనియర్ నాయకులు రాములు, సత్యనారాయణ,పవన్, మున్సిపల్ ఎఇ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.