ధర్మ కంఠ ప్యానెల్ కు భారీ మెజార్టీ
అధ్యక్షులుగా కొండోజు ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శిగా ఎం వేణుగోపాల చారి
కోశాధికారి కాసుల శ్రీధర్ చారి
హైదరాబాద్ నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ భాగ్యనగరం కు ఘనమైన చరిత్ర అద్భుతమైన బంగారు వెండి కళాఖండాలు తయారు చేయడంలో చార్ కమాన్ స్వర్ణకారులు ది ప్రత్యేక స్థానం వారి సమస్యలపై చార్ కమాన్ స్వర్ణకార యూనియన్ ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలు అవుతున్నది 2025 యూనియన్ ఎన్నికలు జరిగినవి ఈ ఎన్నికలు నిర్వహించుట కొరకై దుబ్బాక కిషన్ రావు మరియు ఎం శ్రీహరి ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉండి పోలీస్ వారి సహకారంతో ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్ అభ్యర్థులు పోటీ చేశారు ఈ ఎన్నికల్లో అత్యధిక భారీ మెజార్టీతో ధర్మ కాంట ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించారు అధ్యక్షులుగా కొండోజు ఆంజనేయులు చారి ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరం వేణుగోపాల్ చారి కోశాధికారిగా కాసుల శ్రీధర్ చారి సంచలనం అయినా భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకపై స్వర్ణకారుల సమస్యలు ఏమైనా మా దృష్టికి తీసుకువస్తే దానిపై ఖచ్చితంగా మేము ముందుండి సమస్యలను పరిష్కరిస్తామని చార్ కమన్ స్వర్ణకారుల భవిష్యత్తు కొరకు ఎల్లవేళలా మేము కంటికి రెప్పలా కాపాడుతామని అన్నారు అలాగే నిరుపేదలైన స్వర్ణకారుల కుటుంబాలకు ఆర్థిక సామాజికంగా ఆదుకుంటామని ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించనీకి కృషి చేస్తామని అన్నారు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చార్ కమాన్ సంఘం సీనియర్ సభ్యులు మద్దూరి సుధాకర చారి,చొల్లేటి విష్ణువర్ధన్. జయ విఠల్ చారి భీష్మ చారి. చేపూరి నరేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు