kcr leader of telangana
‘‘శాపనార్థాలకు’’నీళ్లు రావు..’’బూతులకు’’పొలాలు పారవు!
’’కేసీఆర్’’ ను తిడితే పుట్టగతులుండవు.
`తిడుతుంటే వచ్చే తుప్పిళ్లు నీళ్లు కావు!

`శాపనార్ధాలు కాదు సమాధానం చెప్పండి?
`ఎవరి ‘‘పదవి’’ ఎప్పుడు పోతుందో ‘‘గ్యారెంటీ లేదు’’!
`నీళ్లిచ్చిండు..కరంటు తెచ్చిండు..కడుపు నింపిండు.
`నీళ్ళాపిండు..నిలువ చేసిండు..చెరువులు నింపిండు.

`అనుమతుల కోసం ప్రయత్నస్తూనే… ప్రాజెక్టులు కట్టిండు.
`తెలంగాణా దిశ మర్చిండు… దశ మర్చిండు.
`నీటి గోస తీర్చిండు.. తెలంగాణ నెంబర్ వన్ చేసిండు.
`తిండికి గతి లేని తెలంగాణను అన్నపూర?ను చేసిండు.
`పంజాబ్ ను పక్కకు తోసిండు.
`బెంగాల్ ను కిందికి తోసిండు.
`పదేళ్లలో తెలంగాణ రైతును రాజును చేసిండు.
`శాపనార్ధాలతో సమస్యలు పరిష్కారం కావు.
`తెలంగాణా దేవుణి? తిట్టి తప్పు చేస్తుండ్రు.
చావు భాష ఎవరు మాట్లాడినా మంచిది కాదు.
`ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గది కాదు.
`పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.
`ఆ మాత్రం దానికి మిడిసిపాటు ఎవరికీ తగదు.
`ఉన్నత పదవుల్లో వున్న వారికి అసలే మంచిది కాదు.
`తిట్లు కాదు కనీసం తెలివైన సమాధానం వెతకండి.
`జనం చేత శబాష్ అనిపించుకోండి!
`ఎన్నికల ముందు ఆరోపణలు వేరు?
`ఇప్పుడు ‘‘కెసిఆర్’’ ను దూషిస్తే జనం మెచ్చుకోరు.
`‘‘కెసిఆర్’’ ను పాలకులు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రనా గొప్ప వారు కారు.
మళ్ళీ జన్మేత్తినా ‘‘కెసిఆర్’’ చరిత్ర చేరపలేరు.
హైదరాబాద్, నేటిధాత్రి:
మంత్రాలకు చింతకాయలు రాలవు. శాపనార్దాలకు నీళ్లు రావు. తిట్టుకుంటే వచ్చే తుప్పిళ్లు నీళ్లు కావు. నీళ్లంటే మాటలు కాదు. మాటలు చెప్పినంత సులువుగా నీళ్లు రావు. మాటల మూటలు కట్టుకంటూ పోతే కాలం చాలదు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరూ శాశ్వతంకాదు. ప్రాణాలే శాశ్వతం కానప్పుడు పదవులెంత? ప్రాపకాలెంత? వైభవాలెంత? ఇవి తెలిస్తే ఏ వ్యక్తి మరో వ్యక్తిని దూషించడు. చావులు కోరుకోరు. పాలకులా లేక ప్రత్యర్ధులను తిట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ, చావులు కోరుకునే వాళ్లా? ఇవెక్కడి దిక్కుమాలని రాకీయాలు. ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించారు. అది నాయకుల పుణ్యం కాదు. ప్రజల దయాదాక్షిణ్యం. ఏ వ్యక్తికైనా కొపం వుంటే ఒకసారి తిట్టొచ్చు. రెండుసార్లు తిట్టొచ్చు. కాని పదే పదే మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకొకసారి, నోరు తెరిస్తే తిట్ల పర్వం తప్ప మరొక పని లేదా? ప్రజలు పని చేయమని పట్టం కట్టారా? లేక కేసిఆర్ ను తిట్టుకుంటూ కాలం గడపమని గెలిపించారా? రెండేళ్లుగా ఒకటే పనా? కేసిఆర్‌ను దూషించడం తప్ప మరో పని లేదా? ఇన్ని తిడుతున్నా, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఎంతో హుందాగా కేసిఆర్ మౌనంగానేవుంటున్నారు. ప్రజలు చక్కటి అవకాశమిచ్చారు. మాకంటే బాగా పనిచేయండి. నేను ఒక దారి చూపాను. తెలంగాణ భవిష్యత్తు మీది అని ఎంతో హుందా కేసిఆర్ సూచించారు. అయినా సరే మేం మేం మారమన్నట్లు సాగుతున్నారు. అటు బూతులు, ఇటు తిట్లతోనే పుణ్యం కాలం గడిపేస్తారా? ఎంత కాలం కేసిఆర్ మీద పడి ఏడుస్తారు? కేసిఆర్ చేసిన తప్పేంటి? కేసిఆర్ చేసిన అన్యాయమేమిటి? కేసిఆర్ ఒక యోగి. తెలంగాణ త్యాగి. తెలంగాణ మూర్తి. తెలంగాణ స్పూర్తి. తెలంగాణ ఆర్తి. తెలంగాణ దీప్తి. కేసిఆర్ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఎన్ని పదాలు రాసిన తక్కువే. అంత గొప్పది కేసిఆర్ చరిత్ర. ప్రజల గురించి ఆయన ఆలోచించినంతా మరే నాయకుడు ఆలోచించరు. తెలంగాణ కోసం కొట్లాడిరడు. తెలంగాణ తెచ్చిండు. 60 ఏళ్లుగా సాద్య పడని తెలంగాణ సాధన సుసాద్యం చేసిండు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో కనకం చేసిండు. తెలంగాణను అన్ని రంగాల్లో పరుగులు తీయించిండు. ఎప్పుటి నుంచో పరుగులు తీస్తున్న రాష్ట్రాలను దాటుకొని, పదేళ్లలో అన్ని రాష్ట్రాలను దాటేలా చేసింది. అభివృద్ది అంటే ఇదీ అని చూపించిండు. విఫల రాష్ట్రం చేయాలని చూసి, కళ్లలో నిప్పులు పోసుకున్న వారి కనువిప్పు కలిగేలా చేసిండు. తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తే కర్రు కాల్చి వాత పెట్టింతన పని చేసిండు. అలా భయం పెట్టి, తెలంగాణను కాపాడిరడు. అదీ కేసిఆర్. తెలంగాణ ద్రోహులు కపట పన్నాగాలు పన్నుతుంటే, కాళ్లల్లో కట్టెలు పెడుతుంటే కూడా క్షమించిండు. తన కర్తవ్యమే ముఖ్యమని ముందుకు సాగిండు. తెలంగాణను బంగారు తునక చేసిండు. ఇదీ ఒక పాలకుడికి వుండాల్సిన లక్షణం. కాని ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోంది. అసలు కేసిఆర్ తెలంగాణ తేవడమే తప్పనుకుంటున్నారా? కేసిఆర్ తెలంగాణ కోసంకొట్లాడడమే పాపమనుకుంటున్నారా? అరవై ఏళ్లలో కాంగ్రెస్, తెలుగుదేశం చేసిన విద్వంసం నుంచి తెలంగాణను కాపాడినందుకా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసహనమో అర్దం కావడం లేదు. అరవైఏళ్లు పాలించి, తెలంగాణను సర్వనాశనం చేసి, తెలంగాణ ప్రజలను అన్నమో రామ చంద్రా అని ఏడిపించిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో కేసిఆర్ తెలంగాణను నాశనం చేశాడడనడంలో ఔచిత్యమేమిటో కనిపించడం లేదు. 50 ఏళ్లు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కళ్లు చూడలేక, నోరు మాట్లాడలేక, పదవుల్లో వుండి పనులు చేయలేక చేష్టలుడిగిన నాయకులు కూడా ఇప్పుడు కేసిఆర్‌ను తిడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర నాయకులను ఇంకా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వాళ్ల వల్లనే రాజకీయ జీవితాలు వచ్చాయని కృతజ్ఞతలు చూపిస్తున్నారు. ఓట్లేసేసి గెలిపించేది తెలంగాణ ప్రజలు. కాని ఊడిగం ఇంకా ఆంద్రా నాయకులకు చేద్దామనుకే నాయకులు వుండడం దౌర్భాగ్యం. కేసిఆర్ ఏం చేసిండు? ఏం చేసిండు? అని పదే పదే ప్రశ్నించే వారికి కళ్లు లేవా? చూడడం లేదా? కనిపించడం లేదా? ప్రగతి అంటే ఏమిటో చూడకుండానే రాజకీయాలు చేస్తున్నారా? పదేళ్ల కింద పచ్చ గడ్డికి కూడా దిక్కులేని భూముల్లో పచ్చని పైర్లు కనిపించడం లేదా? నీటి చుక్క జాడ లేని చోట పచ్చని పంటలు కనిపించడం లేదా? ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు పచ్చబడితే ప్రజలు వలసలెందుకు వెళ్లేవారు? పంటలు లేని భూముల్లో పలుగు రాళ్లెందుకు తేలేవి? తొండలు కూడా గుడ్లుపెట్టవని ఆంద్రా నాయకులు ఎందుకు ఎగతాళి చేసేవారు? ఇవన్నీ నాయకులు మర్చిపోయినా, జనం మర్చిపోరు. కుప్ప మీద కూర్చొని, తిండికి గతి లేదని ఏడ్చేవారు, గుప్పెడు మెతుకులు చూడని కాలం మర్చిపోతారు. అవకాశ వాద రాజకీయాలు చేస్తారు. కేసిఆర్ లాంటి నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేరు. ప్రపంమంతా వెతికినా కనిపించరు. అంత గొప్ప పాలకుడు కేసిఆర్. అరవై ఏళ్లలో సాద్యం కానిది ఐదేళ్లలో చూపించారు. తెలంగాణ తెచ్చి నీళ్లిచ్చిండు. అదే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎందుకివ్వలేదు? కాని తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే నీళ్లిచ్చిండు. మిషన్ కాకతీయ తేవడానికి ముందే ప్రయోగం చేసిండు. గొలుసు కట్టు చెరువులు నింపడం మొదలు పెట్టిండు. చెరువులన్నీ నింపేందుకు తెలంగాణలో మిషన్ కాకతీయ తెచ్చిండు. 46వేల చెరువులకు పూర్వ వైభవం తెచ్చిండు. వాగులు వంకల ద్వారా చెరువులు నింపిండు. వాగుల్లో నీళ్లు పారించిండు. భూగర్భ జలాలు సమృద్ది చేసిండు. వంకలు, ఒర్రెలు, కుంటలలో కూడా నీళ్లు పారించిండు. అదీ సంకల్పమంటే…అదీ పుట్టిన గడ్డ మీద మమకారమంటే…కరంటు కష్టాల నుంచి ఒక రాష్ట్రాన్ని మూడు నెలల్లో గట్టెక్కించిన నాయకుడు, దార్శనికుడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆరు నెలల్లో ఒట్టిపోయిన తెలంగాణను గంగాళం చేసిండు. అలాంటి పాలకుడు మరొకరు లేరు. తలాపున పారుతున్న గోదారికి తన కాళ్లు అడ్డం పెట్టి ఆపిండు. వాటిని నిలువ చేసిండు. చెరువులు నింపిండు. కాళేశ్వరం కట్టిండు. తెలంగాణ మొత్తం పారించిండు. అటు ఖమ్మందాకా, ఇటు కోదాడ దాక, చిట్ట చివరి పాలమూరు ఊరు దాకా కాళేశ్వరం నీళ్లు పారించాడు. ఎండి ఎండి డొక్కలీడ్చుకుపోయి వున్న తెలంగాణ కడుపు నింపిండు. తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచిండు. అరవై ఏళ్లు ఎండిన బీళ్లకు దాహం తీర్చిండు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన నేలన పుట్లకొద్ది వడ్లు పండిరచిండు. తెలంగాణలో ఒక్క గుంట కూడా పంట లేకుండా వుండకుండా సాగయ్యేలా నీళ్లిచ్చిండు. పంటతో పాటు పాడి పెంచాడు. పాడి పంటలతో తెలంగాణ తులతూగేలా చేసిండు. తెలంగాణ కన్నీళ్లు తుడిచేందుకు ఆగమేఘాలమీద ప్రాజెక్టులు కట్టిండు. కేంద్రం కొర్రీలు పెడుతున్నా, అనుమతులలో జాప్యం చేస్తున్నా లెక్క చేయలేదు. తన తెలంగాణ ప్రజలే తనకు ముఖ్యమని నీళ్లను మళ్లించిండు. అనుమతులు కోసం ఎదురుచూసుకుంటూ కూర్చోలేదు. అటు అనుమతులు కోసం ప్రయత్నాలు సాగిస్తూనే మరో వైపు ప్రాజెక్టులు పూర్తి చేసిన గొప్ప పాలకుడు కేసిఆర్. అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు పెట్టిన తెలంగాణను అన్న పూర్ణను చేశారు. అన్న పూర్ణ అని పేరున్న ఆంద్రా ప్రాంతాన్ని వెనక్కి నెట్టేశాడు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకున్న పంజాబ్‌ను పక్కకు నెట్టేశాడు. బెంగాల్‌ను కిందకు తోసేశాడు. సాగు రంగంలో తెలంగాణలో పదేళ్లలో పంటల విప్లవాన్ని సృష్టించారు. ఎడారిలా మారిన తెలంగాణను ఒయాసిస్సు చేసిండు. అన్ని రంగాలలో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు. ఒకప్పుడు బియ్యమే లేని కాలం. అందులోనూ సన్న బియ్యం అంటే ఆంద్రా నుంచి రావాలని అనుకునే సందర్భం. ఇప్పుడు తెలంగాణ అంతా సన్నబియ్యమే. అందుకు కారణం కేసిఆర్. అలాంటి నెంబర్ వన్ రాష్ట్రాన్ని పాలిస్తూ, కేసిఆర్‌కు శాపనార్దాలు పెట్టడం సరైంది కాదు. నీళ్ల విషయంలో కేసిఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ తప్పుల మీద తప్పు చేస్తోంది. కేసిఆర్ మీద నిందలేస్తూ పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తోంది. కేసిఆర్ ఆకాశమంత మహా మనిషీ. ఆయనను కన్నెత్తి చూసే అర్హత లేని వాళ్లు కూడా కవ్విస్తున్నారు. అదే సమయంలో కలలో కేసిఆర్‌ను గర్తుచేసుకుంటూ జడుసుకుంటున్నారు. పైకి మేక పోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నారు. కేసిఆర్ ముందే కుప్పి గంతులేస్తున్నారు. అసాధ్యాన్ని సుసాద్యం చేసిన యోధుడు. ప్రజలకు సంక్షేమం అందించిన వారే నిజమైన పాలకుడు. ఆ పాలకుడు ఒకే ఒక్కడు. కేసిఆర్. ఆ పేరే తెలంగాణకు సూపర్ పవర్.
