సిరిసిల్లలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

– డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సూర దేవరాజు

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణంలోని 12వ వార్డు చంద్రంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, కాంగ్రెస్ కాంటెస్టెడ్ కౌన్సిలర్ సూర నిర్మల కలిసి ప్రారంభించారు. నర్మెట దుర్గవ్వ-నరసయ్య, భారతి-దేవయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను వారు ప్రారంభించి గృహ యజమానులను అభినందించారు.

అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా లబ్ధిదారులు సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని, లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కత్తెరపాక ఎల్లయ్య, గుడిసెట్టి బాలరాజు, తడక వెంకటేశం, మ్యాన సత్యనారాయణ, అబ్బగోని లచ్చయ్య, కోలకని రాజేశం, ఆడెపు ప్రసాద్, సదుల గంగాధర్, కోలకాని ఎల్లయ్య, ఎర్ర నరసయ్య తదితర కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version