యాదగిరిగుట్టలో బీర్ల ఫౌండేషన్ సహాయం
*నేటి ధాత్రి యాదగిరిగుట్ట:
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మూడో వార్డు లో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వద్దిగాళ్ల రాములమ్మ గారి కుటుంబ సభ్యులకు బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యుల సహకారంతో 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది.
రాములమ్మ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ వైస్ చైర్మన్ బరిగే రమ్య రాoచందర్, ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుడ్ల నరేష్ కుమార్, బూడిద భాస్కర్ , బుగ్గ శ్రీకాంత్ , బూడిద ప్రశాంత్, గుడ్ల మల్లేష్ , కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
