కాంగ్రెస్ పార్టీని నమ్మితే రైతులకు మూడు గంటల కరెంటే..

మూడోసారి దాసరి ఎమ్మల్యే గా గెలవడం ఖాయం…శ్రీకాంత్ గౌడ్

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లి గ్రామ బిఆర్ ఎస్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ఇంటి ఇంటి ప్రచారం చేయడం జరిగింది . ఈసందర్భంగా బీ ఆర్ ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయని అన్నారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే గా దాసరి మనోహర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.పిట్టల ఎల్లయ్య పల్లి గ్రామానికి నూతన గ్రామపంచాయతీ మరియు గ్రామ సౌకర్యార్థం ఎమ్మెల్యే దాసరి రోడ్డు వేయించారు.గత పాలకుల హయాంలో పెద్దపల్లి నియోజకవర్గం వివక్షకు గురైందని,గత తొమ్మిదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు.అధికారంలో ఉన్న నాడు ఏమి చేయలేని దద్దమ్మలు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అసత్యపు ప్రచారాలు చేస్తారన్నారు పెద్దపల్లి ప్రజలు దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదని మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు.పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి మూడోసారి గెలవడం కాయం అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,గుండేటి మధు యాదవ్,గ్రామ అధ్యక్షుడు వేల్పుల శేఖర్,యూత్ అధ్యక్షుడు పిట్టల అరుణ్,గట్టు మహేష్ గౌడ్, అంజన్ రెడ్డి,పెండం శ్రీకాంత్,పిట్టల గట్టయ్య,పెండం చేరాలు,ఓదెలు,వేల్పుల వీరేశం,రవి,లచ్చయ్య,కందుల శ్రీనివాస్,తిరుపతి,అనిల్, శ్యామ్,కుమార్,అనిల్ భారీ సంఖ్యలో గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *