జాతీయ జెండా భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ చౌరస్తాలో నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా భూమి పూజ చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో జాతీయ సమైక్యత కోసం అందరూ పాటుపడాలని, జాతీయ సమైక్యత కోసం నిరంతర శ్రమిస్తున్న గోపాలరావుపేట గ్రామ యువతను అభినందిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల యువత ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఈప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన గోపాలరావుపేటను మండల కేంద్రంగా త్వరలోనే ఏర్పాటు అవుతుందని ప్రకటించారు. గోపాలరావుపేట మండల కేంద్రంగా ఏర్పాటు అయ్యే దాకా విశ్రమించనని పునరుద్ఘాటించారు. ఈప్రాంతంలో ఎదిగిన బిడ్డగా గోపాలరావుపేట మండల కేంద్రం బాధ్యత నాపై ఉందని భరోసా ఇచ్చారు. అలాగే గోపాలరావుపేట మండల కేంద్రం ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ తో ఇదివరకే మాట్లాడానని మళ్లీ ఒకసారి మాట్లాడి త్వరగా మండల కేంద్రం ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా అక్కడ ఉన్న ఉద్యమకారుడు, మాజీ టిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు ఆరె వినోద్ ను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే రవిశంకర్, ఉద్యమకారులని బిఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మాజీ సర్పంచ్ లు, యువజన సంఘాల నాయకులు, కులసంఘాల నాయకులు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *