నర్సంపేట,నేటిధాత్రి :
భారత జాతీయ మహిళా సమైక్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యు) 70 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సంపేట సిపిఐ కాలనీలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పాలక కవిత పార్టీ జెండా ఆవిష్కరించారు.నర్సంపేట మండల అధ్యక్షురాలు చెట్టు మమత అధ్యక్షతన జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కల్పించాలని అలాగే మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు చట్టాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.