టిజిఎఫ్ డిసి డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి
జైపూర్, నేటి, ధాత్రి:
కాలుష్యం రోజురోజుకు పెరిగి పోతు పర్యావరణానికి నష్టం వాటిల్లుతున్నా నేపథ్యంలో చెట్ల పెంపకం ద్వారానే ఆ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించవచ్చని తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టి.జి.ఎఫ్.డి.సి) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ(టి.జి. ఎఫ్.డి.సి)
మంచిర్యాల రేంజ్ పరిధిలోని కుందారం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్యాధికారిణి డాక్టర్ శ్రావ్యతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సౌకర్యార్ధం పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటమన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా తమ ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలన్నారు.పర్యావరణ సమతుల్యత లోపించడం వల్లనే నేటి రోజుల్లో ప్రకృతి లో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడడం ప్రతీ ఒక్కరి నైతిక బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమం లో కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యధికారిణి డాక్టర్ శ్రావ్య తో పాటు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ లు గోగు సురేష్ కుమార్,ఇ. లక్ష్మణ్,డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ లు డి.రాకేష్, జె.నరేష్, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్,బీట్ ఆఫీసర్ సి.హెచ్.రవీందర్, ఫీల్డ్ సూపర్ వైజర్ లు వి.శ్రీనివాస్,వై. రాజేష్, జె. తిరుపతి, వాచర్ లు శంకర్, లచ్చన్న, రాకేష్,ఇతర వైద్య అధికారులు,సిబ్బంది జయమణి, జయమ్మ,గంగయ్య, అఖిల్ లు పాల్గొన్నారు.