రాష్ట్రంలో బలమైన పార్టీగా కాంగ్రెస్.

రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.

ఎస్సీ సెల్ జనగామ జిల్లా చైర్మన్ కడారి నాగేశ్వరరావు.

రఘునాథపల్లి( జనగామ ) నేటి ధాత్రి:-

తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందని ఎన్నికల్లో పార్టీ బలాన్ని ఓట్ల ద్వారా ప్రజలు నిరూపించారని. అన్ని వర్గాలు చూపు కాంగ్రెస్ వైపు ఉందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ మాజీ ఎంపిటిసి కడారి నాగేశ్వరరావు అన్నారు బుధవారం ఆయన రఘునాథపల్లి లో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న ఆరు గ్యారెంటీతోనే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు విజయం సాధించాలని సోనియా గాంధీ నాయకత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొనే దిశగా ముందుకెళ్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల కు సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసుకున్న అదృష్టం లభించిందని ఆయన వివరించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు అవుతాయని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేస్తారని ఆయన భీమా వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *