# ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
నర్సంపేట,నేటిధాత్రి :
ఆడిపాడే వయస్సు నుంచి పాఠశాల స్థాయి ఉన్నత విద్యా వరకు అంతా ఒకటై కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ విద్యను కొనసాగించారు. చిన్ననాటి స్నేహితులు అంతా ఒకేచోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో దుగ్గొండి మండలంలోని మల్లంపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-10 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు వారు చదువులు నేర్చుకున్న అదే పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు.నాడు విద్యాబుద్ధులు నేర్పిన ప్రధానోపాధ్యాయులు సుజాత,సోమయ్యలు ,గురువులు
కృష్ణమూర్తి,మధుకర్, సురేందర్,శ్రీనివాస్, ప్రసాద్ ,కుమారస్వామి, అశోక్,శ్రీలత,తిరుమల,ప్రత్యేక ఆహ్వానితులు చుక్క రమేష్,తడుక కొమురయ్యలను శాలువతో ఘనంగా సన్మానించారు.గత 14 సంవత్సరాల పాఠశాల స్థాయి పదో తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి వాతావరణం నెలకొంది.పలు రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులం ఇక నుండి సమాచారాన్ని పంచుకోవాలని ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కందుల మీనాక్షి,కందుల లిఖిత,స్రవంతి,మౌనిక,రోజా,మౌనిక ,మానస,లిఖిత,సుమలత,సౌజన్య,హరీష్,శివరాం,వినయ్,వినోద్,హరీష్ లు మాట్లాడుతూ ఆయా విద్యార్థులు తమ మధుర జ్ఞాపకాలను వెలుబుచ్చుకుంటు విద్యార్థి జీవితం చాలా ఉన్నతమైనదనీ విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను సాధించడానికి తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.