బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సమావేశ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ..
నన్ను నమ్మి ఈ కష్టకాలంలో కూడా నాతో ఉన్న మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను ఎప్పుడు అండగా ఉంటానని.
ప్రతి సమస్య నా సమస్యగా పరిష్కరిస్తామని తెలిపారు
ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ పై వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వారికి కూడా కొంత సమయం ఇవ్వాలనే ఉదేశ్యంతో నాడు 100 రోజుల వరకు ప్రభుత్వం పై, ప్రభుత్వ విధివిధానాల పై మాట్లాడుతా అని చెప్పడం జరిగింది.
101 వ రోజు నుండి ఎవరైతే ప్రజలు మమ్మల్ని ప్రజా సమస్యలపై పోరాడమని మనల్ని ప్రతిపక్షంలో ఉండమని తీర్పు ఇచ్చారో అదే భూపాలపల్లి ప్రజల సమస్యలపై, భూపాలపల్లి అభివృద్ధి కొరకు మన కార్యాచరణ మొదలు పెడదాం…
అధికార పార్టీ దురాగాతలపై, వారి పాలనపై పోరాటం చేద్దాం అని అన్నారు..
అదే విధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలుపించుకునేలా ప్రతి ఒక్కరం పని చేద్దాం అని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!