మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 22
భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ సమ్మక్క సారక్కల మినీ జాతరాలైన మొగుళ్లపల్లి మరియు వెంచరామి(పురేడు గుట్ట) జాతరాలలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మాజీ భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు…
అమ్మవార్ల చల్లని చూపు ప్రజలమీద ఉండాలని, మహాజతరకు వెళ్లలేని భక్తులు మినీ మేడరాల్లో అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు.
మొగుళ్లపల్లి మండల సమ్మక్క జాతర విషయంలో అధికార పార్టీ నాయకులు రాజకీయాలు చేయడం సబబు కాదని అన్నారు.ఎన్నికల వరకే రాజకీయాలు చేసి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పట్ల సమదృష్టి ఉండాలని సూచించారు. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచిన క్రమంలో జాతరలో విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు.జాతర విషయంలో కొత్త సంస్కృతికి తెరలేపడం మంచి పద్ధతి కాదు అని అన్నారు.
ఈ వేడుకల్లో మొగుళ్లపల్లి, టేకుమాట్ల,చిట్యాల మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.