లారీల కోసం రోడ్డెక్కిన రైతన్నలు
అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మాందారిపేట కూడలి వద్ద లారీలు సకాలంలో రాకపో వడంతో ధాన్యం తరలింపులో ఇబ్బందులు కలగడంతో మం డలంలోని పిఎసిఎస్ సెంటర్ లో రైతులు సోమవారం రోడ్డు పై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. లారీలు సకాలంలో రాకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు నిరసన తెలిపారు అధికారుల నిర్లక్ష్యంతో లారీ లు సకాలంలో రాకపోవడంతో మండుటెండలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు.
అన్నదాతలపై ప్రభు త్వం చిన్నచూపు చూస్తుందని తక్షణం అధికారులు స్పందిం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో మండలంలో ని రైతులు ప్రజలు మహిళలు పాల్గొన్నారుa
