మానవ అక్రమ రవాణా లైంగిక వేధింపులకు గురి కావద్దు
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల
భూపాలపల్లి నేటిధాత్రి
మహిళలను డబ్బులు, ఉద్యోగాల ఆశ చూపించి మహిళలను, చిన్నపిల్లలను లొంగతీసుకుంటారు కానీ ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా బాధితులు, లైంగిక దోపిడీ అనే అంశం పై శనివారం పట్టణంలోని సఖి సెంటర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల మాట్లాడుతూ జిల్లాలో వెనకబాటుతనం ఉందని, దాన్ని ఆసరాగా చేసుకొని నేరస్థులు మోసాలు చేస్తారని అన్నారు. ప్రజల్లో విరివిగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేరాలు జరగకుండా కట్టడి చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి. శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సి.డి.పి.ఓ. రాధిక, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ అసిస్టెంట్ జి. సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
