మే 20న మెడికల్ షాపులు బంద్
మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 మే 2026న దేశవ్యాప్తంగా జరగనున్న బందు గురించి మండల తాసిల్దార్ రవీందర్ మరియు మంగపేట సెకండ్ ఎస్సై శ్రీకాంత్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ మరియు
దేశంలో నెలకొన్న పలు అంశాలపై నిరసనగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (ఏఐఓసిడి) ఈ బందుకు పిలుపునిచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా మందుల దుకాణాలు మూతబడునున్నాయి. ఈ కార్యక్రమంలో మంగపేట మండలం మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, సెక్రటరీ సామల సాంబశివరావు, కోశాధికారి శ్రీనివాసరెడ్డి మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
