ఏకశీల ప్రిన్సిపాల్ ఎం.డి బాబాకు “గురుబ్రహ్మ” అవార్డు
నేటిధాత్రి ఐనవోలు :-
ఎస్ఆర్ఎఫ్ (శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్) గురుబ్రహ్మ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఏకశీల ఈ టెక్నో పాఠశాల ప్రిన్సిపల్ యం.డి.బాబా ఎంపికయ్యారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం రాత్రి ఎస్ఆర్ఎఫ్ గురుబ్రహ్మ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డా|| జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా ప్రిన్సిపల్ యండి. బాబా గురుబ్రహ్మ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి బాబాను అభినందించారు.