dalithulapia mahila ci srilaxmi dashtikam, దళితులపై మహిళా సీఐ శ్రీలక్ష్మి దాష్టీకం

దళితులపై మహిళా సీఐ శ్రీలక్ష్మి దాష్టీకం

అరేయ్‌, ఏయ్‌ ముండల్లారా…ఆ భూమి వదులుకోండి…లేదంటే గు…..బొక్క సాపు చేస్తా. ఎన్ని హక్కు పత్రాలున్న చెల్లవు. కోర్టు ఆర్డర్‌లు నా దగ్గర చెల్లవు. నేను చెప్పిందే చేయాలి. భూమి మీదైన అక్కడికి వెళ్లకూడదు. ఎంతో కొంత తీసుకుని పక్కకు తప్పుకోవాలి. కబ్జా చేసిన వారిదే భూమి నేను చెబుతున్న ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. పోలీసుశాఖలో ఏ ఉన్నత అధికారి కూడా నన్ను ఎం చేయలేడు. నేను చెప్పిందే న్యాయం…వింటే వినండి…లేదంటే మీ ఇష్టం భూమి మాత్రం మీకు దక్కదు. కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, అర్దర్లు ఎన్ని ఉన్నా భూమిలోకి మిమ్మల్ని పోనివ్వను. ఇది నిత్య వివాదాల మహిళ సీఐ ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో తనదైన శైలిలో నడిపిస్తున్న పోలీస్‌ రాజ్యం. కోర్టులంటే గౌరవం ఉండదు. పేదలన్నా, దళితులన్నా అసలే గిట్టదు. మనీ పవర్‌ ఉన్న వాళ్లు ఉంటే సరి చట్టాలు, న్యాయాలను తుంగలో తొక్కుతోంది. తన శాయశక్తులా అన్యాయానికే వత్తాసు పలుకుతుంది. తన పరిధిలోకి రాకున్నా, అది సివిల్‌ మ్యాటర్‌ అయిన తలదూర్చుతుంది. అందినకాడికి దండుకుని పేదలను బెదిరింపులకు గురిచేస్తుంది. అసలు హక్కుదారులపై కబ్జాదారులు దాడులకు పాల్పడినా, మారణాయుధాలతో ఇంట్లో దూరి బెదిరింపులకు గురిచేసిన ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. ఫిర్యాదు చేసిన బాధితులనే అర్థరాత్రి వరకు స్టేషన్‌లో నిర్భంధించి బూతులు తిడుతూ వేధింపులకు గురిచేస్తుంది. తమ భూమి విషయంలో సీఐ వేధింపులు భరించలేక బాధితులు ‘నేటిధాత్రి’ని ఆశ్రయించారు. తమ సొంత భూమిపై తమకు అన్ని హక్కులు ఉండి ఏం లేని వారిగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు నిబంధనల ప్రకారం భూమి మీద హక్కు ఉండడానికి భూమి తమ సొంతమే అని చెప్పడానికి కావాల్సిన అన్ని పత్రాలు ఉన్నా సీఐ తమను మానసిక వేధింపులకు గురిచేస్తోందని తమ సొంత భూమి తమకు కాకుండా చేయడానికి కబ్జాదారులకు పూర్తిగా సహకరిస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు చెప్పిన వ్యక్తి వివరాల ప్రకారం కాజీపేట మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన ఉప్పలమ్మ, ఎలిషా దంపతులకు ఇదే గ్రామశివారులో గుడిగుంట చెరువు ప్రాంతంలో 657 సర్వే నెంబర్‌లో 2ఎకరాల 38గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని తన కొడుకు సండ్ర ఎలిషాకు వీరి నుంచి సంక్రమించింది. 1950 సంవత్సరం నుంచి ఈ భూమి వారసత్వంగా వీరి కుటుంబానికే ఉంది. దశాబ్ధాలుగా ఈ భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబ జీవనం కొనసాగిస్తుంది. ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌ పుస్తకం, పహానీలు, 1బి లాంటి అన్ని హక్కు పత్రాలను తెలంగాణ సర్కార్‌ నుండి వీరు అందుకున్నారు. రెవెన్యూశాఖ ఈ భూమి వీరిదేనని ధృవీకరించి అన్ని భూమిహక్కు పత్రాలను అందజేసింది.

కబ్జా కథ ఇలా మొదలు

గత కొద్ది సంవత్సరాలుగా రాంపూర్‌ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోయాయి. నివాస ప్రాంతాల కోసం పలు కంపెనీలు రియలెస్టేట్‌ వెంచర్‌లు నిర్వహిస్తున్నాయి. దీంతో ఎలిషా భూమికి సైతం డిమాండ్‌ పెరిగింది. పేద దళిత ఎలిషా కుటుంబం భూమిని అమ్ముకుందామనుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన తక్కెళ్లపల్లి ప్రదీప్‌రావు, మునిగాల ప్రభాకర్‌, ఆరెపల్లి కట్టయ్యలు భూమి మాదంటూ కబ్జా తతంగం మొదలుపెట్టారు. సండ్ర మోజేష్‌ తండ్రి కీ.శే.ఎలిషా భూమిని అమ్మాడంటూ ఓ నకిలీ పత్రం ఆర్‌ఓఆర్‌ అంటూ మరో నకిలీ పత్రాన్ని సృష్టించి కేవలం రెండంటే రెండు పత్రాలతో ఈ భూమిపై సర్వ హక్కులు తమవేనని మోజేష్‌ కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం మొదలెట్టారు. వారి భూమి చుట్టూ వారు పెన్సింగ్‌ చేసుకున్న తొలగించి వేశారు. ఈ తగాదా చిలికి, చిలికి గాలివానలా మారి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. ఇంకేముంది కబ్జాదారులు పోలీసులను ప్రసన్నం చేసుకున్నారు. తనకు సంబంధం లేకున్నా సివిల్‌ కేసే అయినా, అన్ని హక్కుపత్రాలు బాధితులకే ఉన్నా ధర్మసాగర్‌ సీఐ మాత్రం కబ్జాదారులకు వత్తాసు పలకడం మొదలెట్టింది. మోజేష్‌కు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించిన సీఐ శ్రీలక్ష్మీ పత్రాలన్నీ సరిగ్గా ఉన్నా తన దగ్గర పనిచేయవని బెదిరింపులకు గురిచేసింది. కబ్జాదారులు భూమి దగ్గర నానా హంగామా సృష్టించినా, పెన్సింగ్‌ తొలగించి వేసినా భూకబ్జాదారులకు సీఐ వత్తాసు పలుకుతోంది. కబ్జాదారులు బాధితుల ఇంట్లో చొరబడి గొడ్డళ్లతో భీభత్సం సృష్టించి బెదిరింపులకు గురిచేసినా, ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా సీఐ శ్రీలక్ష్మి కబ్జాదారులకే అనుకూలంగా వ్యవహారించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో తమను నిర్భంధించి ఇష్టారీతిన తిడుతూ, తమను కొట్టిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

న్యాయం చేయండి

అన్ని హక్కుపత్రాలు కలిగి ఉండి తమ సొంతభూమిలోనే తాము పరాయి వారిగా మారామని మోజేష్‌ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులకు సీఐ శ్రీలక్ష్మి తన శాయశక్తులా సహకరిస్తూ తమను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

శ్రీలక్ష్మి లీలలు

– రేపటి సంచికలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *