రైతులపై కాంగ్రెస్ కపట ప్రేమ బయటపడింది

ఉత్తమా కుమార్ రెడ్డి ఫిర్యాదును రైతులు, గమనించాలి,ఖండించాలి.

డోర్నకల్ ఎమ్మెల్యే
డీఎస్ రెడ్యానాయక్

మరిపెడ నేటి ధాత్రి.

రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఆపాలని పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమా కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం అవేవికమని చర్య అని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి ఆయన మాట్లాడారు. నవంబర్ నెలలో రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించనున్న రైతుబంధు పంపినిని ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలను రైతులు తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ రైతులను కోరారు. 2018లో ప్రారంభమైన రైతు బంధు పథకం ప్రతి సంవత్సరం నవంబరు – జూన్ మాసంలో పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ఇది ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదని,దీన్ని ఆపరాదని ఆయన స్పష్టం చేశారు. 68 లక్షల మంది రైతులకు 73 వేల కోట్ల రూపాయలను పలు దపాలుగా ఇప్పటికే తెలంగాణ సర్కార్ రైతుల ఖాతాల్లో జమ చేసిందని రెడ్యానాయక్ గుర్తు చేశారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో 60 లక్షల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్న ఘనత తెలంగాణ రైతులకు ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. అంతేగాక ఇవాళ రైతుబంధు వద్దంటున్నారు రేపు కరెంటు లేదంటారు, గృహలక్ష్మి ఆపంటారు కాంగ్రెస్ నాయకులు తీరు వల్ల సామాన్య ప్రజలు సంక్షేమ పథకాలు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 11 సార్ల అధికారంలోకి వచ్చిన ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమి లేవన్నారు. కావున తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపట్ల ఆలోచన చేయాలని రైతు నోటికాడి కూడును లాక్కుండే కుట్రను తిప్పికొట్టాలని రైతులను ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్ నాయక్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ ఆయుబ్ పాషా,వీరారం మాజీ సర్పంచ్ దూస్సా నరసయ్య, నాయకులు గంధసిరి కృష్ణ, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *