ప్రమాదాకరంగా ఉన్న ఇనుప ముక్కను తొలగించిన కాంగ్రెస్ నేత
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో రోడ్డు మీద ప్రమాదకరంగా ఉన్న ఇనుప కరెంటు స్తంభం ముక్క. నడికూడ నుండి ధర్మారం వరకు రోడ్డు వెడల్పు లో భాగంగా ఇనుప కరెంట్ స్తంభాలను తొలగించగ మిగిలిన ముక్క రోడ్డు మీద ప్రమాదకరంగా ఉండి వాహనాధారులు ప్రమాదానికి గురయ్యేవారు. నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు చొరవ తీసుకుని కటర్, గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో ఇనుప కరెంట్ స్తంభం ముక్కను తొలగించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. దీనితో పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.