పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం.
నర్సంపేట,నేటిధాత్రి:
ఏ.పి రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణం తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు తీరని లోటు అని బిషప్ ఎం.ఆదామ్ బెన్ని అన్నారు.పాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల నర్సంపేట డివిజన్ పాస్టర్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు పాస్టర్ లాజరు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ మరణంపై యావత్తు క్రైస్తవలోకానికి అనేక అనుమానాలు ఉన్నాయని మరణంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో పాస్టర్స్ రేజి జార్జి,మత్తయి,
బోడ రవికుమార్, చిన్నపెల్లి శ్రీధర్, పాల్,క్రాంతి పాల్, పాల్,శ్రీనివాస్, కుమార్ పాల్,అబ్రాహం,సీమోన్, వెంకన్న,విలియం కేరీ, కొమ్మాలు,రూబెన్,సొలొమోను,
యాదగిరి,ఎఫప్రా,సురేష్,పీటర్,రమేష్ కేరీ,క్రైస్తవ నాయకులు
మంద ప్రకాష్,మారేపల్లి అశోక్,ప్రభాకర్,కొమ్ముల నవీన్,రవి
మాదాసి నవీన్,ఈసాక్ తదితరులు పాల్గొన్నారు.