మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణమ్మ విజయం సాధించిన సందర్బంగా.. హైదరాబాద్ లోని అరుణమ్మ నివాసం దగ్గర పండగ వాతావరణం నెలకొంది. సుమారు ఉదయం నుంచి మహాబూబ్ నగర్ పరిధిలోని పలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు ప్రజలు అరుణమ్మనను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శాలువాలతో సత్కరించి తమ అభిమాన నేతకు అభినందనలు తెలిపారు.
పాలమూరు నాయకులు, కార్యకర్తలు, సన్నిహితుల రాకతో హైదరాబాద్ లోని అరుణమ్మ నివాసం సందడిగా మారింది. అరుణమ్మ మాట్లాడుతూ, పాలమూరు పార్లమెంటులోని ఏడు నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు, నన్ను ఆదరించి నాకు ఓటేసి నా ప్రజానీకానికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.