ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఆర్.ఎం.పి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్
నర్సంపేట,నేటిధాత్రి:
ఆర్ఎంపీ,పీఎంపి వ్యవస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన సమయంలో మద్దతుగా శాసనసభ మండలి కౌన్సిల్ లో గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 45 వేల ఆర్ఎంపీల సేవలు ఎంత అవసరమో వివరించి ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అంటూ ఖరాఖండిగా మాట్లాడారని ఆర్ఎంపీ,పిఎంపి అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్ పేర్కొన్నారు.ఆర్.ఎం.పి ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆర్ఎంపీల సేవలను కొనియాడుతూ కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేసిన సేవలను ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలని తెలపడం అభినందనీయమని అన్నారు. ఇదేవిధంగా ఆర్ఎంపీల గుర్తింపు పట్ల అన్ని వేదికల మీద మొదటి నుంచి ఆర్ఎంపీ,పిఎంపి లకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఈ సమస్యను కౌన్సిల్లో లేవనెత్తడానికి ముఖ్య కారకులైన సందర్భం ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతిపక్ష నాయకులందరూ ఆర్ఎంపీలకు మద్దతుగా నిలవాలని స్వామినాథ్ కోరారు.
ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కోదండరాం సార్ లకు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపి,పిఎంపి అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.