computer vyavasthanu praveshapettina mahaniyudu rajivgandhi, కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ

కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ

భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత దేశప్రధాని రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌, ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు అన్నారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నర్సంపేట అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్‌ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌, ఎంపీపీ తక్కళ్లపెల్లి రవిందర్‌రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓటుహక్కును వినియోగించుకోవడానికి 21సంవత్సరముల నుండి 18 సంవత్సరాల వయస్సు కు తగ్గించి అందరికీ ఓటుహక్కు కల్పించే విధంగా కషి చేశారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ పాలనలోనే పేద ప్రజలకు మేలు జరిగిందని, నిరుపేదలను గుర్తించి అన్నివిధాలుగా ఆదుకున్నారని ఆయన గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ మార్కెట్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పాలాయి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మెర్గు వరలక్ష్మి సాంబయ్య, మాజీ వార్డు మెంబర్‌ దేవోజు సదానందం, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య, నాగేల్లి సారంగం, నర్సంపేట మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణారెడ్డి, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోల చరణ్‌రాజ్‌, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్‌, కాంగ్రెస్‌ నాయకులు దండెం రతన్‌కుమార్‌, గురిజాల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బండారి మంజుల, బీరం భాస్కర్‌రెడ్డి, పొన్నం నర్సింహారెడ్డి, నర్సంపేట ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు ములుకల మనీష్‌, గొర్రె నవీన్‌, కమలాపురం కష్ణలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *