ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్
గంగాధర నేటిధాత్రి :
అనారోగ్యంతో బాధపడుతూ, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసా కల్పిస్తోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ. 22,56,500/- విలువైన ఆర్థిక సహాయం మంజూరు అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు శనివారం గంగాధర మండలం మధురానగర్ లోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపదలో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ తోట కరుణాకర్, బుర్గు గంగన్న,సాగి అజయ్ రావు,సత్తు కనుకయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రెండ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరికంటి కరుణాకర్,ముచ్చ శంకరయ్య,దొమ కొండ మహేష్, మల్లయ్య, శంకర్,మ్యాక వినోద్,ఎమిరెడ్డి నాగేంద్రర్ , శ్రీనివాస్, మంత్రి మహేందర్, పవుల్, నారాయణ ,తదితరులు పాల్గొన్నారు.