పరకాలలో పరిశుభ్రతకు తూట్లు
బేకరీ ఆహార పదార్థాల తరలింపులో నిర్లక్ష్యం
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని కొన్ని బేకరీల్లో తయారయ్యే ఆహార పదార్థాలను పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా తరలిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.బేకరీ వస్తువులను ఎలాంటి కవర్లు,ఎలాంటి రక్షణ లేకుండా ప్లాస్టిక్ ట్రేలలో తీసుకెళ్తుండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ చేయడం,తరలించడం తప్పనిసరి అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం నిబంధనలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ధూళి, కాలుష్యం మధ్య బహిరంగంగా తరలించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఆహార భద్రత అధికారులు స్పందించి బేకరీలు,ఫుడ్ సరఫరా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత నిబంధనలు కచ్చితంగా అమలు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
