దేశ రాజకీయాల్లో మరోసారి “నెంబర్ గేమ్” స్టార్ట్ అయింది..!
ఢిల్లీ పవర్ కారిడార్స్‌లో ఇప్పుడు అందరి చూపు రాజ్యసభ ఎన్నికలపైనే పడింది. ఎందుకంటే.. వచ్చే కొన్ని సంవత్సరాల కేంద్ర రాజకీయ సమీకరణాలకు ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. అందుకే ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
దేశంలోని 10 రాష్ట్రాల్లో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 18న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి కానుండటంతో.. రాజకీయ పార్టీల్లో కసరత్తు ఫుల్ స్పీడ్‌లో మొదలైంది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలు కొనసాగుతుంది. 9న స్క్రూటినీ, 11 వరకు ఉపసంహరణకు గడువు ఉండనుంది. ఇక జూన్ 18 సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. 20 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
ఈసారి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలు హాట్‌సీట్‌లుగా మారగా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మూడేసి స్థానాలు, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి పోరు జరగనుంది.
అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఎందుకంటే.. అసెంబ్లీలో భారీ మెజారిటీతో ఉన్న ఎన్డీయే కూటమి ఈ నాలుగు స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. జూన్ 21తో ఆళ్ల అయోధ్య రాంరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబుల పదవీకాలం ముగియనుండటంతో.. ఇప్పుడు కొత్త పేర్లపై భారీ చర్చ మొదలైంది.
పాలిటికల్ గ్యాలరీల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. టీడీపీకి రెండు స్థానాలు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి దక్కే ఫార్ములాపై ఇప్పటికే కూటమిలో దాదాపు క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. ఢిల్లీలో కూడా ఎన్డీయే బలం మరింత పెరగనుంది. మరోవైపు.. వైసీపీకి ఈ ఎన్నికలు పూర్తిగా డిఫెన్సివ్ మోడ్ పరిస్థితిని తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది.
ఇప్పుడు అసలు ఆసక్తి అంతా ఒక్కటే…
టీడీపీ తరఫున ఢిల్లీకి వెళ్లే ఆ ఇద్దరు ఎవరు..?
జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు..?
బీజేపీ తన కోటాలో ఎవరిని ఎంపిక చేస్తుంది..?
ఈ మూడు ప్రశ్నలే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో వైరల్ డిస్కషన్‌గా మారిపోయాయి.
