దార్శనికుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ నాయుడు
చర్ల నేటిదాత్రి
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు విజయ్ నాయుడు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సత్యనారాయణపురం రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జరిగిన సమావేశం లో విజయ్ నాయుడు మాట్లాడుతూ సాంకేతిక విప్లవం భారతదేశంలో టెలికాం విప్లవానికి కంప్యూటర్ యుగానికి రాజీవ్ గాంధీనే ఆద్యుడన్నారు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించారని నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారన్నారు స్థానిక సంస్థలు పంచాయతీ రాజ్ వ్యవస్థల బలోపేతానికి రాజ్యాంగ సవరణలు తెచ్చారని దేశానికి వారు అందించిన సేవలను ఈ వేదికగా ప్రజలకు తెలియచేసారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ నాయుడు పీసీసీ జెనరల్ సెక్రటరీ నల్లపు దుర్గ ప్రసాద్ డీసీసీ ఉపా అధ్యక్షులు చీమల మరి మురళి డీసీసీ జనరల్ సెక్రటరీ సోడి చలపతి మరియు బీసీ సెల్ ఆర్ వి రమణ ఎస్సి సెల్ కారంపూడి సల్మాన్ మరియు వందే నరసింహమూర్తి ఎస్టీ సెల్ తాటి రామకృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇందల రమేష్ ఆవుల పూల్లరావు ముమ్మినేని అరవింద్ పోలిన లంకరాజు బ్రహ్మనందరెడ్డి గుండెపూడి భాస్కర్రావు మీడియం శోభారాణి బంగారం ఆర్ కొత్తగూడెం ఉపసర్పంచ్ ఆకుల కృష్ణ ఎక్స్ ఎంపిటిసి కుంజా నాగేశ్వరరావు చంటి మునిగాల సాగర్ పూజారి రమణయ్య మునిగేల వేంక్కన్న మెడబత్తిన వాసు మనోహర్ శంకర్ శివ వంశీ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ ఆలం ఈశ్వర్ రాము తోకల దిలీప్ కుమార్ తాటి బాలకృష్ణ సోమరాజు దానావైపేట్ నిరోషా దేవరపల్లి తెల్లం కన్నయ్య శ్యామల గోవిందు తెల్ల మురళి పోడియం జగదీష్ మరియు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సామ్రాజ్యం సత్యనారాయణ పురం సర్పంచి జాగా గౌతమి కలివేరు ఉప సర్పంచ్ రుక్మిణి సున్నంగుంపు నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు అభిమాన సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
