రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 12, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గల సరస్వతి మాత ఆవాలయం లో మార్కండేయ మహర్షి జన్మదినము పురస్కరించుకొని పద్మశాలి కుల బంధువులు మహాశివునికి పంచాభిషేకము చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ పూర్వకాలంలో మ్రుగుంద మహాముని,మదరవతి దంపతులకు చాలా కాలం నుండి సంతానం కలగకపోవడంతో శివుని కటాక్షం కోసం కటోర తపస్సు చేయసాగాడు అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అనగా అప్పుడు ఆ మహాముని సంతానం కావాలని కోరగా మహాశివుడు పదహారు సంవత్సరాల అన్ని సుగుణాలు కలిగిన బాలుడు కావాలా వంద సంవత్సరాలు దుర్గుణాలు కలిగిన బాలుడు కావాలా అడగగా ఆ మహాముని పదహారు సంవత్సరాల సద్గుణాలు గల బాలున్ని ప్రసాదించమని కొరగ తధాస్తు అనగా కొత్త కాలానికి వారి ఇద్దరి దంపతులకు మంచి తేజస్సుతో బాలుడు జన్మించాడని ఆ బాలునికి మార్కండేయ అని నామకరణం చేయడం జరిగిందని అన్నారు ఆ బాలుడు చిన్నతనం నుండే మహాశివుని యొక్క భక్తిపార్వశం లో నిండిపోయేవాడని వన్య ప్రాణుల పట్ల ఎంతో ఆప్యాయతగా ఉండేవాడు అన్ని సద్గుణాలు కలిగిన బాలుడు దినచర్యలో భాగంగా పదహారు సంవత్సరాలు నిండుటకు వస్తున్న తరుణంలో కన్న తల్లి తండ్రిలు కలుతచెందశాగారు. మార్కండేయ మహర్షి తల్లిదండ్రులను చూసి అడగగా మహా శివుడు ఇచ్చిన ఆయుర్దాయం సమయము రాబోతున్నది నీ ఆయుష్ తీరబోతున్నది అని వివరించారు అప్పుడు మార్కండేయుడు నేను నిత్యం పూజించే మహా శివునికి భక్తితో పూజలు చేయుటకు అనుమతించమని తల్లిదండ్రులను కోరాడు ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసి పంపించారు అప్పుడు సుదూర అడవి ప్రాంతంలో ఒక నది తీరాన చేరుకొని ఇసుకతో లింగాకారం చేసి పూజలు నిర్వహించడం స్టార్ట్ చేశాడు మొదలుపెట్టాడు యమదూతలు బయలుదేరి ఆ పాషాన్ని మార్కండేయనికి వేయగా మార్కండేయ మహర్షి శివునికి ఆ పాశం పడడoతో పరమాశివుడుకి పరమ భక్తుడైన మహర్షిని మార్కండేయ మహర్షి కాపాడేందుకు శివతాండవం చేస్తూ యమపాశమును పటాపంచలు చేస్తాడు ఆ విధంగా మార్కండేయుడు మృత్యువుని జయించి పద్మశాలి కుల బంధువులకు ఆదర్శప్రాయంగా నిలిచిన కుల దైవంగా మారారుఅని జన్మవృత్తాంతాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడెపు లక్ష్మణ్, ఆడెపు తిరుపతి, వేముల వెంకటేశం, వేముల అశోక్, సాంబారు వెంకటస్వామి.శివప్రసాద్. గాజoగి సంతోష్, రాజేష్ ఖన్నా,బండి మల్లేష్, సుంకనపల్లి తిరుపతి, వేముల హరిప్రసాద్, పరికిపండ్ల రాజు, అంకంపల్లి సమ్మయ్య. కోమాకుల రాజయ్య. తదితరులు కుల బంధువులు పాల్గొన్నారు.