నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని చాపలబండ గ్రామ సమీపంలో మందపల్లి క్రాస్ రోడ్డు వద్ద గల చెరువులో కొందరు అక్రమార్కులు కర్ణాలకుంట చెరువులోని మొరం మట్టిని అక్రమంగా తవ్వకాలు చేపడుతూ తరలిస్తున్న క్రమంలో సమాచారం మేరకు స్పందించిన దుగ్గొండి మండల నీటిపారుదల శాఖ,రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ తవ్వకాల పట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఎస్సై పరమేష్ మాట్లాడుతూ కర్ణాలకుంట చెరువులోని మొరం మట్టిని కొందరు వ్యక్తులు జేసిబి , ట్రాక్టర్లతో రాత్రిపూట దొంగతనానికి పాల్పడుతున్నారని మండల నీటిపారుదల శాఖ అధికారి ఏఈ రవి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.